iDreamPost
android-app
ios-app

అఫీషియల్: గెటప్ శ్రీను.. రాజు యాదవ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jul 18, 2024 | 3:56 PMUpdated Jul 18, 2024 | 3:56 PM

Raju Yadav OTT Streaming Date Fixed: బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి .. చిన్న చిన్న టీవీ షోస్ ద్వారా ఫేమస్ అయినా ఎంతో మంది నటులు.. ఇప్పుడు వెండి తెరపై కూడా అలరిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు గెట్ అప్ శ్రీను చేసిన మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది.

Raju Yadav OTT Streaming Date Fixed: బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి .. చిన్న చిన్న టీవీ షోస్ ద్వారా ఫేమస్ అయినా ఎంతో మంది నటులు.. ఇప్పుడు వెండి తెరపై కూడా అలరిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు గెట్ అప్ శ్రీను చేసిన మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది.

  • Published Jul 18, 2024 | 3:56 PMUpdated Jul 18, 2024 | 3:56 PM
అఫీషియల్: గెటప్ శ్రీను.. రాజు యాదవ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బుల్లి తెర కామెడీ షోస్, రియాలిటీ షోస్ పుణ్యమా అని.. ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్ట్ లు ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది నటి నటులు.. తమ బుల్లి తెరపై కనబరిచిన తమ ప్రతిభకు నిదర్శనంగా.. వెండి తెరపై ఛాన్స్ దక్కించుకున్నారు. వారిలో ఒకరు గెట్ అప్ శ్రీను.. ఈ నటుడు గురించి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. కామెడీ షోస్, టీవీ ప్రోగ్రామ్స్ , అలాగే కొన్ని సినిమాలలో కూడా.. నటించి ప్రేక్షకుల మెప్పించాడు. ఇక ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా హీరోగా “రాజు యాదవ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

రాజు యాదవ్ సినిమా ఈ సినిమా మే 24 న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో ఆనంద చక్రవాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్, రాకెట్ రాఘవ లాంటి ఎంతో పరిచయస్తులు.. ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు బాగానే ప్రమోషన్స్ జరిపారు. అందులోను ఆల్రెడీ గెట్ అప్ శ్రీను కామెడీ టైమింగ్ , యాక్టింగ్ గురించి తెలిసిన ప్రేక్షకులు.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుకున్నారు. కానీ థియేటర్ రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమా… అందరి అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది ఈ మూవీ. రాజు యాదవ్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా జూలై 24 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కు తీసుకుని రానున్నారు మేకర్స్. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక రాజు యాదవ్ మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమాను ఓ సింపుల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీలో గెట్ అప్ శ్రీను క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా.. అతని ముఖానికి ఓ బంతి తగుల్తుంది. అలా తగలడం వలన అతని ముఖం ఎప్పుడు కూడా నవ్వుతున్నట్లుగానే కనిపిస్తుంది. అది సరిగ్గా అవ్వాలంటే.. సర్జరీ చేయించుకోవాలని చెప్తారు డాక్టర్స్. కానీ ఆ సర్జరీ సరిపడా డబ్బులు అతని దగ్గర ఉండవు. మరోవైపు ఎప్పుడు ఆ ముఖం నవ్వుతు కనిపించడంతో. అతనికి అనేక ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. ఈ క్రమంలో అతనికి ప్రియా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక ఈ అమ్మడి రాకతో రాజు జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో అతను ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి ? అతని ప్రాబ్లమ్ కు సొల్యూషన్ దొరికిందా లేద అనేది తెరపైన చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి.. ఈ వారం OTT లో ఈ 3 వెబ్ సిరీస్ లు చాలా స్పెషల్.. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి