iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ భలే ఉన్నాడే మూవీ OTT డీల్ క్లోజ్

  • Published Sep 11, 2024 | 12:28 PM Updated Updated Sep 11, 2024 | 12:28 PM

Bhale Unnade Movie OTT Partner: ఈ మధ్య కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ బాగా పెరగడంతో.. సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమా కూడా ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంది.

Bhale Unnade Movie OTT Partner: ఈ మధ్య కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ బాగా పెరగడంతో.. సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమా కూడా ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంది.

  • Published Sep 11, 2024 | 12:28 PMUpdated Sep 11, 2024 | 12:28 PM
రాజ్ తరుణ్ భలే ఉన్నాడే మూవీ OTT డీల్ క్లోజ్

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. గత కొన్ని నెలలుగా వీటి క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. థియేట్రికల్ రిలీజెస్ తో పాటు .. కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ నేరుగా కూడా మూవీస్ , వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తున్నాయి. అందులోను తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం విశేషం. ఇక ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ మధ్యలో విపరీతమైన పోటీ నెలకొనడంతో.. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి ముందే.. ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా ఓటీటీ డీల్ డీసెంట్ ధరలకు క్లోజ్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

రాజ్ తరుణ్ హిట్ అనే పదం విని చాలా కాలమే అయింది. రీసెంట్ గా వారం వ్యవధిలోనే రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. పురుషోత్తముడు , తిరగబడరా సామి. ఈ రెండిటిలో కనీసం ఒకటి హిట్ అయినా కూడా రాజ్ తరుణ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు మరొక మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చేస్తున్నాడు రాజ్ తరుణ్. సెప్టెంబర్ 13న రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక ఈలోపే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు డీసెంట్ ధరలకు అమ్ముడుపోయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. మరి థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

మరి మరో రెండు రోజుల్లో వచ్చే ఈ సినిమా అయినా.. ప్రేక్షకులను మెప్పిస్తే కనుక .. రానున్న రోజుల్లో మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. మూవీ రిలీజ్ కు ఇంకా రెండు రోజులు సమయం మాత్రమే ఉన్నా కూడా.. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అంతగా బజ్ లేదు. మరి రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా.. మనీషా కంద్కూర్ నటిస్తుంది. అంతే కాకుండా పాపులర్ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమ్మాయిలను అందంగా అలంకరించే పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. మరి ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి . మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss