iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : ధనుష్ ‘రాయన్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Aug 16, 2024 | 1:26 PM Updated Updated Aug 16, 2024 | 1:26 PM

Raayan Movie OTT Streaming Date: ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాకు.. విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపొయింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Raayan Movie OTT Streaming Date: ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాకు.. విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపొయింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 16, 2024 | 1:26 PMUpdated Aug 16, 2024 | 1:26 PM
అఫీషియల్ : ధనుష్ ‘రాయన్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

తాజాగా ధనుష్ నటించిన ‘రాయన్’ మూవీ జూలై 26న తమిళంతో పాటు.. తెలుగులోనూ థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ మూవీ దాదాపు 550 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ధనుష్ కెరీర్ లోనే తెలుగులో అత్యధిక స్క్రీన్స్ ను కేటాయించిన సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తమిళ్ లో ఈ సినిమాకు విపరీరతమైన బజ్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా థియేటర్ లో రిలీజ్ అయినా వెంటనే ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ ధరలను క్లోజ్ అయింది. ఇక ఇప్పుడు రాయన్ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో చూసేద్దాం.

ఫ్యామిలీ రివేంజ్ డ్రామా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా.. జూలై 26 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా కోలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ , డైరెక్షన్ తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. నుష్ కెరీర్ లో ఈ మూవీ 50 వ మూవీగా తెరకెక్కడం విశేషం. కాగా ఈ సినిమాలో ధనుష్ తో పాటు.. సందీప్‌కిష‌న్‌, ఎస్‌జే సూర్య‌, ప్ర‌కాష్ రాజ్, అప‌ర్ణ బాల‌ముర‌ళి లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఆగస్ట్ 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగు , హిందీ , తమిళం , కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి రానుంది. కాబట్టి ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారు.. ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

Raayan OTT

ఇక రాయన్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ధనుష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో.. తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి భాద్యత అతనిపై పడుతుంది. ఇక అప్పటినుంచి కుటుంబమే లోకంగా జీవిస్తూ ఉంటాడు ధనుష్. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడు.. సెల్వరాఘవన్. మరో వైవు.. అదే ఊరిలో ఉండే ఓ గ్యాంగ్ కారణంగా ధనుష్ కుటుంబంలో అలజడి మొదలవుతుంది. తన తమ్ముళ్లు , చెల్లెలు అంతా కూడా ఆ ప్రమాదంలో చిక్కుకుంటారు. అలాంటి ప్రమాదం నుంచి ధనుష్ వారిని ఎలా కాపాడుకున్నాడు ? వారికి ఎదురైన ప్రమాదం ఏంటి ? తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.