iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చిన పుష్ప విలన్ ‘కోటీ’ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Aug 15, 2024 | 12:20 AM Updated Updated Aug 15, 2024 | 12:20 AM

డాలీ ధనుంజయ్ ఇటీవలో హీరోగా నటించిన కన్నడడ మూవీ 'కోటీ'. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీకి ప‌ర‌మేశ్వ‌ర్ గుండ్కాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మోక్ష కుషాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడాది జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజైంది. అయితే దాదాపు ఎనిమి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మొదటిలో పెద్ద‌గా ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది.

డాలీ ధనుంజయ్ ఇటీవలో హీరోగా నటించిన కన్నడడ మూవీ 'కోటీ'. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీకి ప‌ర‌మేశ్వ‌ర్ గుండ్కాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మోక్ష కుషాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడాది జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజైంది. అయితే దాదాపు ఎనిమి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మొదటిలో పెద్ద‌గా ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది.

  • Published Aug 15, 2024 | 12:20 AMUpdated Aug 15, 2024 | 12:20 AM
OTTలోకి వచ్చిన పుష్ప విలన్ ‘కోటీ’ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నటుడు డాలీ ధనుంజయ్.. ఈ పేరుతో పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. కానీ, అల్లు అర్జున్ పుష్ప మూవీ విలన్ జాలీ రెడ్డి అంటే మాత్రం ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా పుష్ప సినిమాలో తన విలనిజంతో అదరగొట్టాడు ఈ కన్నడ నటుడు. అయితే ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో ప్రేక్షకులను పరిచయమైన డాలి.. ప్రస్తుతం పుష్ప 2లో కూడా నటిస్తున్నాడు. అంతేకాకుండా.. మరో వైపు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ విభన్నమైన పాత్రలతో అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే..ఇటీవలే ఈ నటుడు కన్నడలో ‘కోటీ’ అనే సినిమాలో హీరోగా నటించాడు. కాగా, ఈ సినిమా జూన్ 14వ థియేటర్స్ లో విడుదలై ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడంటే..

డాలీ ధనుంజయ్ ఇటీవలో హీరోగా నటించిన కన్నడడ మూవీ ‘కోటీ’. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీకి ప‌ర‌మేశ్వ‌ర్ గుండ్కాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మోక్ష కుషాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడాది జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజైంది. అయితే దాదాపు ఎనిమి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మొదటిలో పెద్ద‌గా ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. కానీ, ఆ తర్వాత సినిమా మంచి పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ధనుంజయ్ నటనకు మంచి ప్రశంసలు దక్కయి. దీంతో పదిహేను కోట్లకు పైగా వసూళ్లు రాబెట్టి కమర్షియల్ హిట్ గా కోటీ మూవి నిలిచింది. అలాగే త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ధనుంజయ్ కోటీ థియేటర్స్ విడుదలైన రెండు నెలల తర్వాత తాజాగా ధనుంజయ్ కోటి మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి (గురువారం 14) నుంచి స్ట్రీమింగ్ కు అవుతుంది. అయితే ప్రస్తుతం క‌న్న‌డ భాష‌లో మాత్ర‌మే ఈ మూవీ రిలీజైంది. త్వ‌ర‌లో తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ర‌మేష్ ఇందిర, తార‌, రంగాయ‌ణ ర‌ఘు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వీరితో పాటు క‌న్న‌డ సీనియ‌ర్ హీరో దునియా విజ‌య్ గెస్ట్ రోల్‌లో న‌టించాడు.

ఇక ధనుంజయ్ కోటీ మూవీ కథ విషయానికొస్తే..కోటీ (డాలీ ధ‌నుంజ‌య‌) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అయితే తండ్రి దూరం కావ‌డంతో కుటుంబ బాధ్య‌త‌లు అన్ని అత‌డిపై ప‌డ‌తాయి. పైగా తన తండ్రి నేర్పిన సిద్ధాంతాల‌కు కోటీ క‌ట్టుబ‌డి ఎప్పుడు నిజాయితీగా జీవిస్తుంటాడు. ఇక కోటీ త‌న కుటుంబంతో డినో సావ్‌కార్ (ర‌మేష్ ఇందిర‌) అనే రౌడీకి చెందిన జ‌న‌తా సిటీలో అద్దెకు ఉంటాడు. కాగా, త‌న కాల‌నీలో అద్దెకుండే వారి చేత క్రిమిన‌ల్ ప‌నులు చేయిస్తుంటాడు డినో. ఈ క్రమంలోనే.. కోటికి కూడా డినో కొన్ని పనులు చెప్పగా దానికి అతను అంగీక‌రించ‌డు. దీంతో కావాల‌నే కోటీకి అప్పులు క్రియేట్ చేస్తాడు డినో. వాటిని సాకుగా చూపించి కోటీని రౌడీగా మార్చుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? కుటుంబ‌మే ప్రాణంగా బ‌తికే కోటీ డినో శంక‌ర్ కార‌ణంగా రౌడీలా మారాడా? ఆ రౌడీకి ఎదురుతిరిగి త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే కోటీ మూవీలో యాక్ష‌న్‌, ఫ్యామిలీ అంశాల‌తో ద‌ర్శ‌కుడు చూపించాడు. మరీ, ధనుంజయ్ కోటీ మూవీ కన్నడ వెర్షన్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.