iDreamPost
android-app
ios-app

PT Sir OTT:సైలెంట్ గా OTT లోకి మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jun 21, 2024 | 4:55 PMUpdated Jun 21, 2024 | 4:55 PM

ఓటీటీ లో కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 21, 2024 | 4:55 PMUpdated Jun 21, 2024 | 4:55 PM
PT Sir OTT:సైలెంట్ గా OTT లోకి  మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ప్రతి వారం ఓటీటీ లలో కొత్త రకమైన కంటెంట్ తో.. సినిమాలు , సిరీస్ లు విడుదల అవుతాయన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా ప్రేక్షకులంతా హర్రర్ , క్రైమ్ థ్రిల్లర్ , సస్పెన్స్ , ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల కంటెంట్ ను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోను ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాస్ ను చూసేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటువంటి సినిమాలు రావడం ఈ మధ్య చాలా అరుదైపోయాయని చెప్పి తీరాలి. ఈ క్రమంలోనే మే 24 న తమిళ థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమా.. ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు “పీటీ సర్”. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

పీటీ సర్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ సంపాదించుకున్నా సరే.. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో మాత్రం ఈ సినిమా.. 7.6 రేటింగ్ సంపాదించుకుంది. దీనితో అసలు ఈ సినిమాలో ఏముందా అనే ఇంట్రెస్ట్ అందరికి కలిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. భాషతో సంబంధం లేదు కేవలం కంటెంట్ ఏ ముఖ్యం అనుకునే వాళ్ళు ఎంచక్కా ఈ సినిమాను ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు ఎలాగూ ఓటీటీ లకు బాగా ఆదరణ లభిస్తుంది కాబట్టి.. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

PT Sir

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ గా మారుతాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయికి జరిగిన అన్యాయానికి.. ఓ పాఠశాలకు వ్యతిరేకంగా పోరాడతాడు. మరి ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా ! ఈ క్రమంలో పీటీ సర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు! చివరికి కథ ఎలా సాగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాశ్మిరా పరదేశి నటించగా వీరితో పాటు.. ప్రభు, కె భాగ్యరాజ్, పాండియరాజన్, మునిష్కాంత్, త్యాగరాజన్, ఇళవరసు, దేవదర్శిని, పట్టిమండ్రం రాజా, వినోదిని లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. కాబట్టి ఈ వీకెండ్ ఈ సిరీస్ ను ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి