iDreamPost
android-app
ios-app

సలార్ పృథ్వీ‌రాజ్ ఇంత కామెడీ చేస్తాడా? కొన్ని గంటల్లో OTTలోకి సూపర్ మూవీ!

  • Published Jun 24, 2024 | 4:17 PM Updated Updated Jun 24, 2024 | 4:17 PM

సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది రెండు చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం విశేషం. అందులో ఓ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది రెండు చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం విశేషం. అందులో ఓ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

  • Published Jun 24, 2024 | 4:17 PMUpdated Jun 24, 2024 | 4:17 PM
సలార్ పృథ్వీ‌రాజ్ ఇంత కామెడీ చేస్తాడా? కొన్ని గంటల్లో OTTలోకి సూపర్ మూవీ!

ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా.. నెల రోజుల్లో లేదా 45 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగడం లేదు. ఆ లోటును తీర్చేస్తున్నాయి ఓటీటీలు. అలాగే ప్రతి వారం తెలుగు సినిమాలే కాకుండా.. ఇతర భాషా చిత్రాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగులో ఉన్నా లేకపోయినా.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో కవర్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. ముఖ్యంగా మలయాళ సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఓ పట్టుపట్టేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఆడియన్స్.. కేరళ చిత్రాలకు ఎడిక్ట్ అయ్యారనే చెప్పొచ్చు. ఎలాంటి సినిమా వచ్చినా చూసి.. చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఓ మాలీవుడ్ మూవీ రిలీజైన 40 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది చూసేయండి.

సలార్, గోట్ లైఫ్ ఆడు జీవితం చిత్రాలతో ఫుల్ ఫాంలో ఉన్నాడు మాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్. గోటై లైఫ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి విదితమే. సుమారు 150 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ హీరో నుండి వచ్చిన మరో చిత్రం గరువాయూర్ అంబలనాడయిల్. జయ జయ జయ జయ హే ఫేం విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. దీనిని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు E4 ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్, సిజు సన్నీ, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది మే 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. సుమారు 100 కోట్లకు దగ్గరలో కలెక్షన్లను కురిపించింది ఈ కామెడీ ఎంటర్ టైనర్.

మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన 10వ చిత్రంగా.. అలాగే ఈ ఏడాదిలో భారీ కలెక్షన్లను రాబట్టుకున్న 5వ చిత్రంగా నిలిచింది. గురువాయూర్‌లో జరిగిన పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చి ఆరు వారాలు గడిచిందో లేదో ఓటీటీ బాట పట్టేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే.. రిలీజైన 40 రోజులకే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా భారీ రేటుకు కొనుగోలు చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో ఈ ఏడాది రెండు బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియన్ స్టార్ పృథ్వీ రాజ్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom