Krishna Kowshik
ఇటీవల మలయాళ డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన సంగతి విదితమే. వాటిల్లో ఒకటి ప్రేమలు. ఈ మూవీతో తెలుగు కుర్రాళ్లకు క్రష్ బ్యూటీగా మారిపోయింది మమితా బైజు. ఇప్పుడు ఆమె నటించిన మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.
ఇటీవల మలయాళ డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన సంగతి విదితమే. వాటిల్లో ఒకటి ప్రేమలు. ఈ మూవీతో తెలుగు కుర్రాళ్లకు క్రష్ బ్యూటీగా మారిపోయింది మమితా బైజు. ఇప్పుడు ఆమె నటించిన మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.
Krishna Kowshik
ప్రేమలు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ కుట్టి మమితా బైజు. ఈ మూవీతోనే ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్ల క్రష్ హీరోయిన్ అయిపోయింది. ఆమె నటించిన మూవీ ఖోఖో. 2021లో ఈ చిత్రం రిలీజైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్నాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటించింది. ఇందులో పీటీ టీచర్ గా నటించింది రవితేజ బ్యూటీ రజీషా విజయన్. రజీషా.. రామారావు అన్ డ్యూటీలో నటించింది. రజియా, మమితా కలిసి నటించిన చిత్రమే ఖోఖో. రాహుల్ రాజీ నాయర్ దర్శకుడు. ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కింది. కాగా, ఇందులో రజీషా, మమితా నటనకు కేరళ ఫిల్మ్స్ క్రిటిక్స్ అవార్డులు దక్కాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కానీ కరోనా ఎఫెక్ట్ ఈ మూవీపై తీవ్ర ప్రభావం చూపింది. థియేటర్లలో ఈ సినిమాకు అంత ఆదరణ దక్కలేదు. కానీ టీవీలో ప్రసారం.. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ 12.7 పాయింట్లు సాధించడం గమనార్హం. మలయాళంలో మహిళా ఓరియెంట్ చిత్రాల్లో అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా నిలించింది. టీఆర్పీ రేటింగ్ సాధించిన 15 చిత్రాల జాబితాలో ఖోఖో మూవీ చోటు దక్కించుకుంది. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. జూలై నెలలోనే రాబోతున్నట్లు పేర్కొంది. అయితే రిలీజ్ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. రెండు లేదా మూడో వారంలో రానున్నట్లు సమాచారం.
త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న ఖోఖో మూవీ కథ విషయానికి వస్తే.. ఫ్రాన్సిస్ మారియా (రజిషా విజయన్) ఓ గర్ల్స్ స్కూల్‌లో పీటీ టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఖోఖో టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుంటుంది. అలాగే ఖోఖో టీమ్ కెప్టెన్ గా ఉంటుంది అంజు (మమితా బిజు). ఫ్రాన్సిస్ మారియా ఖోఖో టీంకు శిక్షణనిస్తూ ఉంటుంది. ఈ టీమ్ నేషనల్స్‌కు ఎలా సెలెక్ట్ అయ్యింది? ఫైనల్లో విజేతగా నిలవడంలో కెప్టెన్ అంజు (మమితా బైజు) ఎలాంటి పాత్ర పోషించింది? ఈ జర్నీలో మారియాతో పాటు అంజుకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ. ఇందులో మరో విశేషమేమిటంటే.. రియల్ ఖోఖో ప్లేయర్ నటించడం గమనార్హం.