iDreamPost
android-app
ios-app

OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘గోలీ సోడా రైజింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 29, 2024 | 5:41 PM Updated Updated Aug 29, 2024 | 5:41 PM

OTT Upcoming Web Series- Goli Soda Raising: ఇప్పుడు తెలుగు సినిమాలతో పాటు అన్ని భాషల చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళంలో బాగా హిట్ అయినా గోలీ సోడా సినిమా నుంచి.. మూడో పార్ట్ వెబ్ సిరీస్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

OTT Upcoming Web Series- Goli Soda Raising: ఇప్పుడు తెలుగు సినిమాలతో పాటు అన్ని భాషల చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళంలో బాగా హిట్ అయినా గోలీ సోడా సినిమా నుంచి.. మూడో పార్ట్ వెబ్ సిరీస్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 29, 2024 | 5:41 PMUpdated Aug 29, 2024 | 5:41 PM
OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘గోలీ సోడా రైజింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లోని కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను బట్టి.. కొత్త సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తమిళంలో భారీ హిట్ అందుకున్న మూవీ గోలీ సోడా.. ఈ ఫ్రాంచైజీ నుంచి.. ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. 2014 లో గోలి సోడా మూవీ మొదటి పార్ట్ రిలీజ్ కాగా.. 2018లో గోలి సోడా 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మూడవ పార్ట్ ను వెబ్ సిరీస్ రూపంలో .. గోలీ సోడా రైజింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మరి ఈ సిరీస్ ఎక్కడ , ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

డైరెక్టర్ విజయ్ మిల్టన్ గోలీ సోడా సినిమాకు దర్శకత్వం వహించారు. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో మొదటి పార్ట్ కు 7.7 రేటింగ్ ఉండగా.. రెండో పార్ట్ కు 7 రేటింగ్ ఉంది. దీనితో ఇప్పడు ఈ సినిమాలకు కంటిన్యుషన్ గా మరో పార్ట్ ను కూడా అనౌన్స్ చేయడంతో.. మూవీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. పైగా ఇప్పుడు వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరిగిపోవడంతో.. మూడో పార్ట్ ను సినిమా రూపంలో కాకుండా సిరీస్ రూపంలో తీసుకుని రావడం విశేషం. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. తాజాగా ఈ సిరీస్ ను సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గోలీ సోడా రైజింగ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాళీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే.. ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కొనసాగబోతుందని తెలుస్తుంది. ముందు విడుదల చేసిన రెండు సినిమాలకు తగినట్లుగానే.. ఈ సిరీస్ కూడా కొనసాగనుంది. పోలీసులు , యూత్ గ్యాంగ్ , హత్యలు , యాక్షన్ సీన్స్ ఇలా అన్ని మిక్స్ చేసి ఈ టీజర్ లో చూపించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తి కరంగా కొనసాగడంతో… ఈ సిరీస్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş