iDreamPost
android-app
ios-app

OTT లో వాస్తవ ఘటనల మర్డర్ మిస్టరీ ‘సెక్టార్ 36’.. మస్ట్ వాచ్ థ్రిల్లర్

  • Published Sep 14, 2024 | 5:00 PM Updated Updated Sep 14, 2024 | 5:00 PM

OTT Telugu Movie Suggestions- Sector 36: డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఈ మధ్య విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు కూడా మంచి టాక్ సంపాదించుకుంటుంది. మరి ఈ మూవీ అసలు కథేంటో చూసేద్దాం.

OTT Telugu Movie Suggestions- Sector 36: డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఈ మధ్య విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు కూడా మంచి టాక్ సంపాదించుకుంటుంది. మరి ఈ మూవీ అసలు కథేంటో చూసేద్దాం.

  • Published Sep 14, 2024 | 5:00 PMUpdated Sep 14, 2024 | 5:00 PM
OTT లో వాస్తవ ఘటనల మర్డర్ మిస్టరీ ‘సెక్టార్ 36’.. మస్ట్ వాచ్ థ్రిల్లర్

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కు ఈ మధ్య క్రేజ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ఓటీటీ లోకి వచ్చే కంటెంట్ కంటే కూడా నేరుగా ఓటీటీ లోకి వచ్చే కంటెంట్ కే.. ఎక్కువ ఆదరణ లభిస్తుంది. పైగా ఇప్పుడు తెలుగులో పెరుగుతున్న క్రేజ్ ను చూసి.. ఒరిజినల్ గా అవి ఏ భాషలో ఉన్నా కూడా.. తెలుగులోను స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ అయింది. అది కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా… కాబట్టి ఈ మూవీని అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే . మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో నిఠారి కేస్ ను సాల్వ్ చేసిన తీరును చూపించారు. అసలు ఈ నిఠారి కేస్ ఏంటో చూసేద్దాం. ఇండియన్ క్రైమ్ హిస్టరీలోనే .. ఈ నిఠారి కేస్ ఎంతో భయంకరమైనది. 2006 లో జరిగిన ఈ సంఘటన దేశం మొత్తాన్ని భయంతో వణికించింది. నోయిడా దగ్గరలో.. నిఠారి అనే ఊరిలో చాలా అస్తిపంజరాలు దొరికాయి. దీనితో అప్పట్లో ఈ విషయం అందరికి గుండెలు వణుకు పుట్టించింది. పైగా ఆ కేసును విచారించగా అవన్నీ అప్పటివరకు తప్పిపోయిన చిన్నారులవని కేసులో తేలింది. అంతే కాకుండా ఆ చిన్నారులపై లైంగిక దాడులు చేసి హత్య చేసినట్లు.. దర్యాప్తులో కనుగొన్నారు. అదే కేసును .. అప్పుడు జరిగిన సంఘటనలను.. ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు ? కేవలం చిన్నారులనే ఎందుకు టార్గెట్ చేశారు ? పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారా లేదా ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు సెక్టార్ 36. ప్రస్తుతం ఎలాగూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వచ్చి ఇంకా ఒక్క రోజు కూడా కాకముందే. మంచి బజ్ ను సంపాదించుకుంటుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను మిస్ అవ్వొద్దని.. చాలా మంది సజ్జెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాగా ఈ సినిమాకు ఆదిత్య నింబల్కర్ దర్శకత్వం వహించగా.. విక్రాంత్ మాసే, దీపక్‍ ,ఆకాశ్ ఖురానా, దర్శన్ జరివాలా, బహురుల్ ఇస్లాం, ఇహానా కౌర్, తనుశ్రీ దాస్, సుబీర్, కుచో అహ్మద్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాగూ తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది కాబట్టి.. ఈ వీకెండ్ ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.