Tirupathi Rao
OTT Suggestions- Best Action Thriller: మీరు ఓటీటీలో చాలానే యాక్షన్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి మూవీ చూస్తే మాత్రం వావ్ అనడమే కాదు.. కన్నీళ్లు కూడా పెట్టేసుకుంటారు. ఓటీటీని ఈ మూవీ షేక్ చేసేసింది.
OTT Suggestions- Best Action Thriller: మీరు ఓటీటీలో చాలానే యాక్షన్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి మూవీ చూస్తే మాత్రం వావ్ అనడమే కాదు.. కన్నీళ్లు కూడా పెట్టేసుకుంటారు. ఓటీటీని ఈ మూవీ షేక్ చేసేసింది.
Tirupathi Rao
కొన్ని సినిమాలు చూస్తే వావ్ అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు చూస్తే భలే మూవీ చూశాం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ, ఇంకొన్ని సినిమాలు చూస్తే మీకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే.. శభాష్ అనని ప్రేక్షకుడు ఉండడు. అలాంటి ఒక కథే ఈ మూవీలో ఉంది. పైగా ఈ మూవీలో ఉండే కాన్ ఫ్లిక్ట్, ఎమోషన్ కి ఓటీటీ ఆడియన్స్ పిచ్చోళ్లు అయిపోతారు. ప్రస్తుతం ఆడియన్స్ అంతా హీరామండి చూసి వావ్ అంటున్నారు. కానీ, అంతకు మించిన ఒక కథతో కొన్నేళ్ల ముందే ఒక సినిమా వచ్చింది. ఆ మూవీ గురించి ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ, ఒకసారి ఆ మూవీ చూశారు అంటే కచ్చితంగా ఎమోషనల్ అయిపోతారు.
ఇప్పటివరకు మీరు చాలానే యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, సిరీస్లు చూసుంటారు. అలాగే వాటిలో చాలా వరకు స్వాతంత్రానికి సంబంధించినవి కూడా అయ్యి ఉంటాయి. అయితే ఈ సినిమా కూడా అలాంటి ఒక కథే. కాకపోతే ఇది ఒక వే*శ్యా గృహానికి సంబంధించింది. అక్కడ చాలా ఏళ్లు ఎంతో మంది జమిందారులను, రాజ కుటుంబీకులను, సాధారణ వ్యక్తులనను తమ ఆటతో, సంగీతంతో, శరీ*రంతో అలరించారు. అయితే ఒక ఘటన వారి జీవితాలను మార్చేస్తుంది. భారత్- పాక్ విడిపోయిన సమయంలో జరిగిన ఘటన ఇది. బోర్డర్ లో ఉన్న ఈ వే*శ్యా గృహం మధ్యగా రెండు దేశాల సరిహద్దు వస్తుంది. ఆ కోటను ఖాళీ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తారు.
అప్పటి వరకు పురుషులను సు*ఖ పెట్టిన ఆ మహిళలే.. కొదమ సింహాల్లా పోరాటం చేస్తారు. మల్లెపూలు కట్టిన ఆ చేతులతో బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. ఇందులో మీరు ఎంతో ఎమోషనల్ అయ్యే పాయింట్స్ కూడా ఉంటాయి. ఆ వే*శ్యలు తమ కోట కోసం, తమ జీవితాల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆడియన్స్ కి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇందులో సీన్ సీన్ కి మంచి మంచి ట్విస్టులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఒక వే*శ్యా గృహం యువరాణిగా విద్యాబాలన్ నటన అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఇలాంటి ఒక పాత్రలో ఎదురు నిలబడిన పోలీసులు, రాజులు, అధికారులను ఎదిరించి ఆమె నిలబడితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
ఎందరో మోసపోయిన యువతులను చేరదీసి వారితో అదే పనిని చేయిస్తూ.. వారి జీవితాలను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ మూవీ పేరు బేగం జాన్. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి. కానీ, హిందీ రాదు అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ప్రతి సీన్ లో విద్యా బాలన్ తెగువ, ఆమె కళ్లతో చెప్పే డైలాగ్స్ మీకు ఊరికే అర్థమైపోతాయి. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ ని మిస్ అయినవాళ్లు అవుతారు. అలియా భట్ గంగూభాయి కతియావాడీ, ఇప్పటి హీరామండి కూడా ఈ సినిమాని చూసి ఇన్ స్పైర్ అయినట్లే అనిపిస్తాయి. మీరు గనుక ఇప్పటికే విద్యా బాలన్ చేసిన బేగం జాన్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.