iDreamPost
android-app
ios-app

OTT Suggestions : ఊహించని ట్విస్ట్ తో క్లైమ్యాక్స్ .. OTTలో ఓ రేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Jul 08, 2024 | 5:37 PM Updated Updated Jul 08, 2024 | 5:37 PM

OTT Best Suspense Thriller: సస్పెన్స్ థ్రిల్లర్ , సీరియల్ సైకో కిల్లర్ మర్డర్స్ ఇవన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller: సస్పెన్స్ థ్రిల్లర్ , సీరియల్ సైకో కిల్లర్ మర్డర్స్ ఇవన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 08, 2024 | 5:37 PMUpdated Jul 08, 2024 | 5:37 PM
OTT Suggestions : ఊహించని ట్విస్ట్ తో క్లైమ్యాక్స్ .. OTTలో ఓ రేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ చూడడానికి చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అనుమానాస్పద హత్యలు, గుర్తుతెలియని నిందితులు.. వాటిని సాల్వ్ చేయడానికి పోలీసులు పడే అవస్థలు ఇలా వీటి అన్నిటి చుట్టూ ఈ సినిమా కథలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే . కానీ క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరు ఊహకు అందదు. సైకో కిల్లర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో.. హీరోకు ఇంకా ఎన్నో ఆశ్చర్య పోయే నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ మూవీ మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. నీలగిరి అటవీ ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ తిరుగుతూ ఉన్నాడని.. అదే సీరియల్ కిల్లర్ మినిస్టర్ చిన్న కొడుకు చిన్నాను చంపేసినట్లు.. అందుకని ఆ ప్రాంతం వైపు ఎవరు వెళ్ళొద్దని అందరిని హెచ్చరిస్తారు. కట్ చేస్తే అశోక్ , లీనా లు ఆ అడవి వైపు వెళ్తారు. ఈ క్రమంలో ఊహించనట్లు గానే వారికి ప్రమాదం ఏర్పడుతుంది. లీనాను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ నాలుగు సంవత్సరాలు తర్వాత చూపిస్తారు. లీనా చనిపోవడంతో అశోక్ ఆమెనే తలుచుకుంటూ.. బాధపడుతూ ఉంటాడు. అలాగే ఆమెను చంపిన సీరియల్ కిల్లర్ ను చంపాలి అనుకుంటాడు. దీని కోసం పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ క్రమంలో అతనికి మొత్తం ఎన్ని మర్డర్స్ జరిగాయో తెలుస్తుంది కానీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరో మాత్రం తెలియదు.

Veezam

కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అశోక్ ఫ్రెండ్స్ దివ్య , ప్రీతి కొద్దీ రోజులు అతని రూమ్ లోనే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రీతి అశోక్ ను ఇష్టపడుతుంది. దీనితో ప్రీతి లీనా గురించి అశోక్ ను అడుగుతుంది. అక్కడ అశోక్ లీనాతో తన లవ్ స్టోరీని చెప్తాడు. లీనా అశోక్ ఇద్దరు కూడా చిన్నపటినుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్. లీనా కు ఫ్రాన్సిస్ అనే బావ కూడా ఉంటాడు అతను ఓ పోలీస్ ఆఫీసర్. అయితే గతంలో కూడా ఆ సీరియల్ కిల్లర్ వీళ్లద్దరి మధ్య ఆ సైకో కిల్లర్ ఉంటాడు. ఆ తర్వాత లీనా ఎలా చనిపోయిందో కూడా ఆమెకు చెప్తాడు. ఇక అశోక్ ఎలా అయినా ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవాలని అనుకుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? వాళ్ళను చంపుతుంది నిజంగా ఆ హత్యలు చేస్తుంది సైకో కిల్లర్ ఏ నా ! లీనా ను చంపింది ఎవరు ? అశోక్ అసలు నిజం తెలుసుకుంటాడా ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “వేజహం” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపైమి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి