OTT Suggestions- Animated Comedy Movie: OTT లో 'సోనిక్ ది హెడ్జ్ హాగ్' మూవీ చూస్తే నవ్వకుండా ఉండలేరు

OTT లో ‘సోనిక్ ది హెడ్జ్ హాగ్’ మూవీ చూస్తే నవ్వకుండా ఉండలేరు

OTT Animated Comedy Movie: యానిమేషన్ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేది కేవలం యానిమేషన్ మూవీ మాత్రమే కాదు.. సూపర్ పవర్స్ ఉన్న స్పేస్ క్రియేచర్ భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది. అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. పిల్లలు , పెద్దవాళ్ళు కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది.

OTT Animated Comedy Movie: యానిమేషన్ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేది కేవలం యానిమేషన్ మూవీ మాత్రమే కాదు.. సూపర్ పవర్స్ ఉన్న స్పేస్ క్రియేచర్ భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది. అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. పిల్లలు , పెద్దవాళ్ళు కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది.

కొన్ని సినిమాలు కేవలం పెద్ద వాళ్ళు మాత్రమే చూడగలిగేలా ఉంటాయి. ఇక యానిమేషన్ , కార్టూన్స్ లాంటి సినిమాలైతే పిల్లలు మాత్రమే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మాత్రం పిల్లలు, పెద్ద వాళ్ళు కలిసి చూసేలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క యాక్షన్ సీన్స్ తో.. ఎంటర్టైన్ చేస్తుంది. ఓ సూపర్ పవర్స్ ఉన్న స్పేస్ క్రియేచర్ భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. అసలు ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే .. సోనిక్ ఒక అందమైన ప్రపంచంలో నివసించే సూపర్ స్పీడ్ పవర్ ఉన్న ఒక క్రియేచర్. సోనిక్ ఒక గుడ్ల గూబ ఆధ్వర్యంలో పెరుగుతూ ఉంటుంది. అయితే తన శక్తి గురించి తెలిసిన అదే ప్రపంచంలో ఉన్న కొంతమంది సోనిక్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. వెంటనే గుడ్ల గూబ అది గమనించి సోనిక్ ను తీసుకుని పారిపోతుంది. ఈ క్రమంలో వాళ్ళు వేసిన బాణం గుడ్ల గూబకు తగుల్తుంది. దీనితో వెంటనే సోనిక్ ను మ్యాజిక్ రింగ్ సహాయంతో భూమి మీదకు పంపించేస్తుంది. కట్ చేస్తే పదేళ్ల తర్వాత సినిమాను చూపిస్తారు. హీరో సిటీ బయట హైవే దగ్గర స్పీడ్ సెన్సార్ పట్టుకుని ఉంటాడు. అక్కడ ఒక తాబేలు తప్ప ఏమి ఉండదు. కానీ ఉన్నట్లుండి అక్కడ స్పీడ్ సెన్సార్ లో 300 స్పీడ్ కనిపిస్తుంది. అంటే అక్కడ సోనిక్ హీరోకు కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది. హీరోకు ఏమి అర్థంకాదు అక్కడ సోనిక్ వెంట్రుక కనిపిస్తుంది. దానిని కూడా లైట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఇక సోనిక్ ఆ తాబేలును కార్ తొక్కకుండా కాపాడి.. ఒక అడవిలో వదిలేసి వస్తుంది . సోనిక్ కు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. తన పవర్స్ గురించి ఎవరికైనా తెలిస్తే తనను బందిస్తారేమో అని చెప్పి ఎవరికీ కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది. ఇలా ఓ రోజు సోనిక్ గుడ్ల గూబ ఇచ్చిన రింగ్ సహాయంతో.. మష్ రూమ్ వరల్డ్ కి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ వెళ్ళదు. సోనిక్ రోజు చేసే పనేంటంటే సిటీని, హీరోను గమనిస్తూ టైమ్ పాస్ చేయడం. అసలు సోనిక్ అనే ఓ స్పేస్ క్రియేచర్ భూమి మీద ఉన్నట్లు ఒక ముసలాయనకు తప్ప ఎవరికీ తెలియదు. కట్ చేస్తే ఓ రోజు సోనిక్ కోపంతో స్పీడ్ గా ఓ గ్రౌండ్ లో పరిగెట్టడంతో పెద్ద మొత్తంలో ఎనర్జీ రిలీజ్ అయ్యి.. భూమి మీద షార్ట్ సర్క్యూట్ అయ్యి పవర్ పోతుంది. ఆ సమయంలో హీరోకు సోనిక్ వెంట్రుక మెరుస్తూ కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మిలటరీ , గవర్నమెంట్ ఎవరికీ అర్ధం కాదు. అసలు సోనిక్ ఎవరు ? ఇవన్నీ ఎవరు చేస్తున్నారనేది అక్కడి వారికి కనుగొన్నారా లేదా? హీరో సోనిక్ ను పట్టుకుంటాడా ? సోనిక్ గురించి తెలిసిన ఆ ముసలాయన ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే “సోనిక్ ది హెడ్జ్ హాగ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఇప్పటికే రెండు పార్ట్శ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది . త్వరలోనే మూడు పార్ట్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments