iDreamPost
android-app
ios-app

భయపెడుతూనే నవ్వించే సినిమా ఇది.. OTT లో బెస్ట్ కామెడీ హర్రర్ మూవీ

  • Published Jul 09, 2024 | 3:19 PM Updated Updated Jul 09, 2024 | 3:19 PM

OTT Best Horror Comedy Movie: హర్రర్ సినిమాలంటే సాధారణంగా అందరు భయపడతారు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం భయపడుతూనే నవ్వుతారు. ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Horror Comedy Movie: హర్రర్ సినిమాలంటే సాధారణంగా అందరు భయపడతారు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం భయపడుతూనే నవ్వుతారు. ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 09, 2024 | 3:19 PMUpdated Jul 09, 2024 | 3:19 PM
భయపెడుతూనే నవ్వించే సినిమా ఇది.. OTT లో బెస్ట్ కామెడీ హర్రర్ మూవీ

హర్రర్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా భయపెడుతూ.. తర్వాత ఏం జరుగుతుందా అనే టెన్షన్ ఇస్తూ.. ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఎంత భయపెట్టినా సరే.. ఈ హర్రర్ సినిమాలను చూడడం మాత్రం అసలు ఆపరు మూవీ లవర్స్. మరి హర్రర్ మూవీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించాలంటే మాత్రం దానికి కామెడీ టచ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఈ సినిమా భయపెడుతూనే నవ్విస్తూ.. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి ఓ మూవీని ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు. మరి ఈ మూవీ ఏంటి.. ఈ మూవీ ని మీరు చూశారా లేదా.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. చీకటిగా ఉన్న ఊరిలో దూరంగా ఉన్న ఓ ఇంటి నుంచి ఓ అమ్మాయి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి పేరు నాక్.. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో నొప్పులు భరించలేక అరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పొరపాటున తన గదిలో ఉన్న దీపం కూడా ఆరిపోయి అంతా చీకటి మయం అవుతుంది. ఆమె ఆ చీకట్లో పిమాక్ పిమాక్ అని అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. ఇక్కడ యుద్ధంలో కొంతమంది సైనికులను చూపిస్తారు. ఇక్కడ యుద్ధంలో గాయపడిన మాక్.. తన ఫ్రెండ్స్ తో.. ఈ యుద్ధంలో ఎలా అయినా గెలవాలి.. ఇంట్లో నా భార్య ఒక్కతే ఉంటుంది అని చెప్తాడు. దీనితో మాక్ తన ఐదుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఆ యుద్దాన్ని ఛేదిస్తారు. అప్పుడు పిమాక్ తన నలుగురు ఫ్రెండ్స్ ను తన ఇంటికి పిలుస్తాడు.

Pee Mak Meiteilon

ఈలోపు నాక్ తన కొడుకుని ఎత్తుకుని.. పిమాక్ పిమాక్ అని పిలుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు ఊరంతా ఎందుకో భయపడుతూ ఉంటుంది, అయితే పిమాక్ ఇంటికి వెళ్లేసరికి తన భార్య , బిడ్డ ఇద్దరు కనిపించరు. దీనితో అతను కాస్త కంగారు పడేలోపే నాక్ అతనికి కనిపిస్తుంది. ఈ క్రమంలో నాక్ సరదాగా పిమాక్ ను దెయ్యం వచ్చిందని సరదాగా ఏడిపిస్తుంది. అయితే నాక్ మాట విన్నప్పుడల్లా ఆ ఊరంతా భయపడతారు. ఇక కొద్దీ సమయం తర్వాత పిమాక్ తన ఫ్రెండ్స్ కు ఊరంతా చూపిస్తాడు.అయితే అక్కడ పిమాక్ ను చూసిన వారంతా కూడా భయపడుతూ.. అతనితో మాట్లాడడం మానేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్ధం కాదు.

ఒకావిడ మాత్రం నీ భార్యను రెండు కాళ్ళ మధ్య నుంచి చూడామని చెప్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నాక్ మాట వింటే అందరు భయపడతారు ? నాక్ మనిషా దెయ్యమా ? పిమాక్ కు ఈ విషయం ఎలా తెలుస్తుంది ? పిమాక్ ఫ్రెండ్స్ అతనికి ఏ విధంగా హెల్ప్ చేస్తారు ? ఎందుకు దారిలో కనిపించిన ఓ ఆవిడ తన భార్య ను రెండు కాళ్ళ మధ్య నుంచి చూడామని చెప్తుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే “పీ మాక్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.