Swetha
OTT Best Mystery Thriller : మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్.. ప్లాట్ ఒకటే అయినా కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడ ఇలాంటి మూవీ గురించే. మరి ఈ సూపర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
OTT Best Mystery Thriller : మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్.. ప్లాట్ ఒకటే అయినా కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడ ఇలాంటి మూవీ గురించే. మరి ఈ సూపర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
Swetha
ఏదేమైనా ఎంత హర్రర్ మూవీస్ చూసినా సరే.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇప్పటివరకు ఓటీటీ లో చాలా మర్డర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు. ఇక ప్రతి కథలోనూ ఏదైనా మర్డర్ జరిగితే.. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ జర్నలిస్ట్.. ఆ మర్డర్ వెనుక ఉన్న నిజా నిజాలను వెలికి తీస్తుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్ ప్లాట్ ఒకటే అయినా కానీ స్టోరీ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఈ మూవీ కూడా దాదాపు అలాంటిదే. ఓ మంచి సూపర్ న్యాచురల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. చర్చ్ ముందు అరవిందన్ అనే వ్యక్తి రెయిన్ కోట్ వేసుకుని నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి.. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చావు. ఇన్ని రోజులు నన్ను ఛేజ్ చేస్తున్నది నువ్వే కదా అని అతనిని షూట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు పొద్దునే అక్కడకు పోలీసులు వస్తారు. ట్విస్ట్ ఏంటంటే ఆ డెడ్ బాడీ అరవిందన్ ది. దీనితో అక్కడి నుంచి ఆ హత్య కోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. మరో వైపు అమల అనే జర్నలిస్ట్.. ఈ డెత్ కేసును తమ ఛానెల్ లోనే ముందు రివీల్ చేయాలని.. ఈ డెత్ వెనుక ఉన్న మిస్టరీని వెతుకుతుంది. ఈ క్రమంలో ఆ హత్యలు చేసింది పోతన్ అనే వ్యక్తి అని కనుక్కుంటుంది. కానీ ఆ పోతన్ ఎవరో ఏంటో అనేది అమలకు ముందే తెలుసు.
పోతన్ కోసం పోలీసులు ఎప్పటినుంచో వెతుకుతూ ఉంటారు. అరవిందన్, పోతన్ ఇద్దరూ కూడా కాలేజీ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్. అరవిందన్ ఏ పోతన్ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అందుకే ఈరోజు పోతన్ అరవిందన్ ను చంపేసి ఉంటాడు అని అనుకుంటుంది అమల. దీనితో పోతన్ , అరవిందన్ చదువుకున్న కాలేజీకి వెళ్తుంది. అయితే పోతన్ కాలేజ్ డేస్ నుంచి అమ్మాయిలను ఏడిపించడం , ర్యాగింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. పైగా అరవిందన్ ప్రేమించిన ఓ అమ్మాయిని.. పోతన్ కూడా ప్రేమిస్తాడు. ఇలా పోతన్ కాలేజీ లో చేయని తప్పులు లేవు. మరి ఇప్పుడు పోలీసులు పోతన్ గురించి ఎందుకు వెతుకుతున్నారు ? అసలు కారణం ఏమై ఉంటుంది ? ఈ కేసును పోలీసులు సాల్వ్ చేస్తారా ? ఆ జర్నలిస్ట్ దీని వెనుక ఉన్న నిజ నిజాలను ఎలా బయటకు తీసుకుని వస్తుంది. ఇవన్నీ తెలియాలంటే.. “ఒరిముఖం” అనే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. ఈ హరర్ మూవీ తీస్తూనే ఆరుగురు మృతి.. OTTలో ఇది చూడాలంటే గట్టి గుండె కావాలి!