iDreamPost
android-app
ios-app

OTT లో అనుష్క శర్మ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ‘NH 10’.. వెంటనే చూడండి

  • Published Aug 18, 2024 | 2:00 AM Updated Updated Aug 18, 2024 | 2:00 AM

OTT Best Survival Thriller: ప్రేమ, పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి ప్లాట్ లో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ను మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

OTT Best Survival Thriller: ప్రేమ, పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి ప్లాట్ లో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ను మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

  • Published Aug 18, 2024 | 2:00 AMUpdated Aug 18, 2024 | 2:00 AM
OTT లో అనుష్క శర్మ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ‘NH 10’.. వెంటనే చూడండి

సర్వైవల్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకుని.. రూపొందించినవే. అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న వారు.. ఆ సమస్య నుంచి బయటపడే క్రమంలో .. వారి ప్రాణాలను కాపాడుకునేందుకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. అనే కాన్సెప్ట్ తోనే ఈ సర్వైవల్ థ్రిల్లర్స్ కొనసాగుతూ ఉంటాయి. అయితే.. వీటిలో ప్రేమ, పరువు హత్యల నేపథ్యంలో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ను మాత్రం చూసి ఉండరు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సిఇనిమను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ కూర్గావ్ లో ఉంటున్న మీరా, అర్జున్ అనే దంపతులతో మొదలవుతుంది. ఒక రోజు వీరిద్దరూ ఒక పార్టీకి వెళ్తారు. కానీ పార్టీ మధ్యలో మీరా కు ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆమె ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. కొంతదూరం వెళ్లిన తర్వాత.. కొంతమంది వచ్చి మీరాపై ఎటాక్ చేస్తారు. ఎలాగూ ఒకలా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. మరుసటి రోజు మీరా అర్జున్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు ఈ కేసును మేము సాల్వ్ చేస్తామని చెప్పి.. మీరా సేఫ్టీ కోసం ఒక లైసెన్స్డ్ గన్ కొని ఇవ్వమని.. అర్జున్ కు చెప్తాడు. కట్ చేస్తే రెండు రోజుల తర్వాత మీరా బర్త్ డే సందర్బంగా.. వారిద్దరూ లాంగ్ డ్రైవ్ కు వెళ్లి ఓ ప్రైవేట్ విల్లాలో బర్త్ డే జరుపుకోవాలని అనుకుంటారు. అనుకున్న ప్రకారమే వారు NH10 పై బయల్దేరతారు. కొంతదూరం వెళ్ళాక వారు ఒక దాబా దగ్గర ఆగుతారు.

అక్కడ సడెన్ గా మీరా దగ్గరకు పింకీ అనే అమ్మాయి వచ్చాయి.. తనను తన భర్తను కాపాడమని వేడుకుంటుంది. మీరాకు ఏమి అర్థంకాక సారీ చెప్పి అర్జున్ దగ్గరకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే.. కొంతమంది పింకీ హస్బెండ్ ను దారుణంగా కొడుతూ ఉంటారు. అర్జున్ వాళ్లకు సహాయం చేస్తాడు. అర్జున్ కు ఆ గ్యాంగ్ లీడర్ కు మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. మీరా ఎంత చెప్పినా కూడా అర్జున్ వినిపించుకోకుండా.. అతనితో గొడవ పడతాడు. కొంత సేపటికి ఆ గ్యాంగ్ అర్జున్ కళ్ళముందే.. పింకీని ఆమె హస్బెండ్ ను దారుణంగా చంపేస్తారు. వెంటనే అర్జున్, మీరా అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ ఇంతలో ఆ మనుషులు వీళ్ళపై కూడా ఎటాక్ చేస్తారు. అర్జున్, మీరా ఎంత బ్రతిమాలినా కానీ వారిని దారుణంగా కొడుతూనే ఉంటారు. అసలు ఆ గ్యాంగ్ ఎవరు ? మొదట మీరాపై ఎటాక్ చేసింది ఎవరు ? వీరి నుంచి అర్జున్, మీరా తప్పించుకున్నారా లేదా ? తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “NH 10” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin