OTT Suggestion: OTT లో దిమ్మ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్.. ఆ ట్విస్ట్ కోసం చివరి వరకు చూడాల్సిందే !

OTT Best Suspense Thriller : తెలుగులో కూడా కొత్త కాన్సెప్ట్ తో చాలానే సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Best Suspense Thriller : తెలుగులో కూడా కొత్త కాన్సెప్ట్ తో చాలానే సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

హాలీవుడ్ , బాలీవుడ్ లోనే తెలుగులో కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో చాలానే సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ.. ఆ సినిమాలో ఉండే లాజిక్ అర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. తెలుగులో మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. దాదాపు తెలుగులో వచ్చిన సినిమాలన్నిటిని మూవీ లవర్స్ చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఈ సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే .. ఈ సినిమా స్టార్టింగ్ లో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని కిడ్నప్ చేస్తారు. ఆ ముగ్గురు కూడా ఆ అమ్మాయిని మరొకరికి అప్పగించి వెళ్ళిపోతారు. కట్ చేస్తే వారం తర్వాత నేపోలియన్ అనే వ్యక్తి తన నీడ పోయిందంటూ.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.. మొదట పోలీసులు దీనిని చాలా సిల్లి గా తీసుకుంటారు. కానీ రెండు రోజులకు కానీ వారికి అర్థంకాదు నిజంగానే అక్కడ నెపోలియన్ నీడ కనిపించదు. దీనితో ఈ కేసును పరిగణలోకి తీసుకుని నెపోలియన్ ను విచారిస్తారు. ఇంతలో ఈ న్యూస్ అంతా కూడా మీడియా ఛానెల్స్ వాళ్లకు తెలుస్తుంది. ఇక విచారణలో వారికి కొన్ని ఊహించని నిజాలు తెలుస్తాయి. నెపోలియన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి రెండు రోజులు ముందు ఒక ఆవిడ వచ్చి.. నెపోలియన్ తప్పి పోయినట్లు కంప్లైంట్ ఇస్తుంది. అసలు తన పేరు నెపోలియన్ కాదని అశోక్ అని తెలుస్తుంది.

కానీ అతను మాత్రం.. నా పేరు అశోక్ కాదని అంటాడు. దీనితో ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలుస్తారు. ఆమె అతని భార్య స్రవంతి.. ఆమె తన భర్తను గుర్తుపడుతుంది. తన భర్త ఎదో కారణం చేత గతం మర్చిపోయాడని చెప్తుంది. దీనితో ఆ పోలీస్ ఆఫీసర్ అశోక్ ను రెండు రోజులు ఆగి పంపిస్తానని చెప్పి ఆమెను పంపించేస్తాడు. అయితే ఈలోపే నెపోలియన్ నాకు కలలో దేవుడు.. జరగబోయేవి జరిగేవి అన్ని చెప్తాడని చెప్తాడు. అవన్నీ క్రాస్ చెక్ చేయగా నిజమే అవుతాయి. అసలు ఎవరు ఈ నెపోలియన్ ? అతని నీడ పోవడం ఏంటి ? అతనికి మూవీ స్టార్టింగ్ లో కిడ్నప్ అయినా అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా ? అతను ఎందుకు గతం మర్చిపోతాడు ? అతనికి దేవుడు ఎందుకు కనిపిస్తాడు ? అసలు కథ ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే “నెపోలియన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments