iDreamPost
android-app
ios-app

OTT Suggestion: 15 రోజులుగా OTTని షేక్ చేస్తున్న దొంగ బాబా మూవీ.. సేవ పేరుతో అమ్మాయిలను!

  • Published Jul 06, 2024 | 1:38 PM Updated Updated Jul 06, 2024 | 1:38 PM

Best Recent OTT Thriller : దేవుడు పేరుతో మోసం చేసే వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వాటిని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

Best Recent OTT Thriller : దేవుడు పేరుతో మోసం చేసే వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వాటిని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

  • Published Jul 06, 2024 | 1:38 PMUpdated Jul 06, 2024 | 1:38 PM
OTT Suggestion: 15 రోజులుగా OTTని షేక్ చేస్తున్న దొంగ బాబా మూవీ.. సేవ పేరుతో అమ్మాయిలను!

నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు ఎప్పుడు కూడా.. కాస్త డిఫరెంట్ గానే ఉంటూ ఉంటాయి. పైగా అవి అనుకోని విధంగా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక ఈ జోనర్ లో ఇప్పటివరకు ఈ జోనర్ లో చాలానే సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఇలాంటి ఎక్సపెరిమెంట్స్ చేయడానికి బాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే.. రీసెంట్ గా మరొక హిందీ చిత్రం ఓటీటీ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పైగా ఈ సినిమాతో అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అయ్యాడు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కర్సన్ దాస్ అనే అతనికి చిన్నప్పటి నుంచి కూడా.. తన చుట్టూ జరిగే ప్రతి విషయం వెనుక ఉండే కారణాలను తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అదే ఇంట్రెస్ట్ తో అతను పెద్దయిన తర్వాత ఓ రైటర్ గా మారుతాడు. అయితే 1862 లో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బ్రిటిష్ పాలనే నడుస్తున్నా కానీ.. బొంబాయిలో మాత్రం మహారాజ్ జే జే చెప్పిందే శాసనం. అతనిని సాక్షాత్తు కృష్ణుని రూపం అని.. అతను ఉండే హవేలిని దేవాలయంలా భావిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. అలా ఓసారి జేజే కళ్ళు కర్సన్ దాస్ కు కాబోయే భార్య పై పడతాయి. ఆమె కూడా జేజే కు సేవ చేయడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. పైగా వారిద్దరూ శారీరకంగా కలిసినప్పుడు ఇతరులు డబ్బులిచ్చి చూసే వీలు కూడా ఉంది. దీనితో కర్సన్ దాస్ తన భార్య ను అక్కడినుంచి వచ్చేమంటాడు. కానీ తన భార్య ఇతను మాటలు పట్టించుకోదు. దీనితో వారిద్దరూ తమ పెళ్లిని రద్దు చేసుకుంటారు.

Maharaj

ఇదే విషయాన్నీ ఆమె జేజే కు చెప్తుంది. దీనితో జేజే ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. కొద్దీ సేపటి తర్వాత ఆమె చెల్లి కూడా జేజే కు సేవ చేయడానికి వచ్చిన సంగతి ఆమె గమనిస్తుంది. దీనితో కర్సన్ దాస్ చెప్పిందంతా నిజమని అర్థంచేసుకుని.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. పైగా చనిపోయే ముందు తాను రాసిన లేఖలో జెజె గురించి ప్రజలందరికి తెలిసేలా చేయమని కోరుతుంది. ఈ క్రమంలో ఓ రోజు లీలావతి తన అన్నతో కలిసి.. జెజె దగ్గరకు వస్తుంది. జెజె వలన ఆమె గర్భవతి అయ్యిందని చెప్తే.. తనకు అబార్షన్ అవ్వడానికి ఓ విషం కలిపిన లడ్డును ఆమెకు ఇస్తాడు, దీనితో ఆమె ఆరోగ్యం క్షీనిస్తుంది. వారిని ఆ జెజె మాయ నుంచి కాపాడడానికి.. కర్సన్ దాస్ తానే కొత్తగా ఓ పేపర్ ను ప్రారంభించి అందులో జెజె గురించి రాయడం స్టార్ట్ చేస్తాడు, కానీ జెజె వాటికి అడ్డుపడతాడు, ఆ తర్వాత ఏం జరిగింది! జేజే గురించి కర్సన్ ప్రజలకు ఎలా తెలియజేస్తాడు! ఇవన్నీ తెలియాలంటే “మహారాజ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş