iDreamPost
android-app
ios-app

సైకోపై అన్నదమ్ముల పగ.. OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Aug 01, 2024 | 9:30 PM Updated Updated Aug 02, 2024 | 7:11 PM

OTT Suspense Thriller : కొన్ని సినిమాలు చూడడానికి... కాస్త ఇబ్బందిగా భయంకరంగా ఉంటూ ఉంటాయి. అయినా సరే వాటిని ఎలాగైనా చూడాలని కాస్త దైర్యం తెచ్చుకుని ఆ సినిమాలను చూస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను చూశారా లేదా ఓసారి చెక్ చేయండి.

OTT Suspense Thriller : కొన్ని సినిమాలు చూడడానికి... కాస్త ఇబ్బందిగా భయంకరంగా ఉంటూ ఉంటాయి. అయినా సరే వాటిని ఎలాగైనా చూడాలని కాస్త దైర్యం తెచ్చుకుని ఆ సినిమాలను చూస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను చూశారా లేదా ఓసారి చెక్ చేయండి.

  • Published Aug 01, 2024 | 9:30 PMUpdated Aug 02, 2024 | 7:11 PM
సైకోపై అన్నదమ్ముల పగ.. OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్

ఓటీటీ లో చూసేందుకు చాలా సినిమాలు ఉన్నప్పుడు.. ఏ సినిమా చూడాలా అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. వీటిలో ఇప్పుడు అందరూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటి మూవీస్ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఓ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. సస్పెన్స్ తో పాటు ఈ మూవీలో మంచి మంచి ట్విస్ట్ లు కూడా ఉంటూ ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఆ విషయాలను ఓసారి చూసేయండి .

ఈ సినిమా కథ విషయానికొస్తే.. చాలా కాలం క్రితం ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ కుటుంబం మొత్తం చాలా వైలెంట్ గా ఉంటారు. భార్య , అత్త , మామాయ్య అందరూ ఊరిలోని వారితో గొడవలు పడుతూ.. హత్యలు చేస్తూ ఉంటారు. అది చూసిన ఆ వ్యక్తి తన పిల్లలను హింసకు దూరంగా పెంచాలని అనుకుంటాడు. అయితే మొదటి ఇద్దరు కొడుకులు కూడా తన తల్లిలానే గొడవలు చేస్తూ వైలెంట్ గా ఉంటాడు. దీనితో మూడవ కొడుకునైనా వీటి నుంచి దూరంగా ఉంచాలని.. అతనిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. అతని పేరు చిక్కు .. అప్పటినుంచి వీరిద్దరూ గొడవలకు దూరంగా ఉంటారు. 9 సంవత్సరాల తర్వాత చిక్కు , అతని అన్నయ్యలు ఇద్దరు కలిసి సీక్రెట్ గా ఎలా చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. చిక్కు తన ఇద్దరు అన్నయ్యలను చూసి వారి ప్లాన్స్ వింటూ భయపడుతూ ఉంటాడు.

ఆ తర్వాత ఫారెస్ట్ ఏరియా లో ఉన్న ఓ రబ్బర్ తోట దగ్గరకు వెళ్లి.. ఈ తోట మధ్యలోనే ఓ ఇళ్లు ఉంది ఆ ఇంట్లో సత్యం అనే వ్యక్తిని చంపితే.. మన పని అయిపోతుంది అనుకుని మొత్తం ప్లాన్ చేసుకుంటారు. ఇదంతా చూసి భయపడిన చిక్కు.. ఆ ఇద్దరి అన్నయ్యల దగ్గర నుంచి పారిపోతాడు. దీనితో ఆ ఇద్దరు అన్నలు.. ఇతనిని పట్టుకుని.. వాళ్ళ అమ్మతో కాల్ మాట్లాడిస్తారు. కాల్ లో ఆమె అతనిని భయపెట్టి.. ఆ మర్డర్ ప్లాన్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇక మర్డర్ చేయడానికి వెళ్లే ముందు.. ఓ హోటల్ లో వీళ్లంతా భోజనం చేస్తూ ఉంటారు. అయితే అప్పటికే చిక్కు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అసలు అతను ఎలా చనిపోయాడో.. ఇప్పుడు సత్యం ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడో అన్నీ చెప్తాడు. దీనితో సత్యం ను చంపడానికి అక్కడకు వెళ్తారు. కానీ అక్కడకు వెళ్లిన సత్యం ఇంట్లో జోహాన్ అనే అతనిని చూసి.. వీరంత భయపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది ? సత్యం ను ఆ ముగ్గురు అన్నదమ్ముల చంపారా లేదా? అసలు ఈ మూవీ నేమ్ కు కథకు సంబంధం ఏంటి ? చివరకు కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “కడశీల బిర్యానీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişCasibomcasibomcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetbetciomatbet girişgalabetjojobetGrandpashabet FenerbahçeGrandpashabet ekşiGrandpashabet ekşiJojobet girişMarsbahis GirişJojobetbetparkCasibom