Tirupathi Rao
OTT Suggestions- Best Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలానే సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక మెడికల్ మాఫియా క్రైమ్ థ్రిల్లర్ మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే అమ్మాయల చర్మం వలిచి వ్యాపారం చేస్తూ ఉంటారు.
OTT Suggestions- Best Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలానే సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక మెడికల్ మాఫియా క్రైమ్ థ్రిల్లర్ మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే అమ్మాయల చర్మం వలిచి వ్యాపారం చేస్తూ ఉంటారు.
Tirupathi Rao
క్రైమ్ థ్రిల్లర్స్ చూడటం ఓ బ్యాడ్ హ్యాబిట్. కానీ, అవి చూడకుండా మాత్రం ఉండలేము. మీకు ఆ అలవాటు ఉన్నా కంగారు పడకండి. ఎందుకంటే మూవీ లవర్స్ లో చాలా వరకు క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలే చూస్తూ ఉంటారు. అయితే ఓటీటీల్లో ఇప్పటికే ఉన్న చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూసేసి ఉంటారు. ఇంకా కొత్తగా ఏం చూద్దాం అనే ఆలోచన ఉంటోందా? అయితే మీకోసం ఒక బెస్ట్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి తీసుకొచ్చాం. నిజానికి ఈ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. అందులోనూ మిల్కీ బ్యూటీ హన్సిక ఈ మూవీలో లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది. పైగా ఇది ఒక అండర్ వరల్డ్ క్రైమ్ బేస్ చేసుకుని నడుస్తూ ఉండే సినిమా.
ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా మంది క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసేందుకు ఇష్టపడతున్నారు. అయితే ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చి చాలా రోజులు అవుతోంది. అందుకే ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు మీకోసం హన్సిక లీడ్ రోల్ ప్లే చేసిన ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఆ మూవీ పేరు ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఈ చిత్రం 2023లో విడుదలైంది. ఈ సినిమాకి మంచి మౌత్ టాక్ వచ్చింది. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ కేటగిరీలో ఈ చిత్రం దూసుకుపోతోంది. పైగా హన్సిక హీరోయిన్ కావడంతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ మూవీలో చాలా మంచి స్టార్ కాస్ట్ ఉంది. ప్రేమ, పూజా రామచంద్రన్, జయప్రకాశ్, మురళీ శర్మ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు.
ఈ మూవీ కథ విషానికి వస్తే.. అందమైన అమ్మాయిల కిడ్నాపింగ్. అయితే ఇప్పటివరకు చాలానే నేరాలను చూసుంటారు. అందులో అమ్మాయిలను వ్యభి*చార కూపాల్లోకి తోయడం, వారి అవయవాలు అమ్ముకోవడం వంటివి చూసుంటారు. కానీ, ఈ మూవీలో చాలా కొత్త పాయింట్, చాలా కొత్త క్రైమ్ తో వచ్చారు. అదేంటంటే.. అందమైన అమ్మాయిల చర్మాన్ని స్మగ్లింగ్ చేయండి. ఆర్గాన్ ట్రాఫికింగ్ లో అది కూడా ఒక వింగ్ అనమాట. అయితే ఇలాంటి ఒక ఆలోచన కూడా ఆడియన్స్ కి రాదు. కానీ, అలాంటి ఒక పాయింట్ తో డైరెక్టర్ ఈ మూవీని తీసుకురావడంతో అంతా షాకయ్యారు. ఆ మూవీ చూసిన తర్వాత ఆయన టాలెంట్ కి షేక్ అయ్యారు.
మొత్తానికి ఈ మూవీకి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. పైగా ప్రేమలాంటి సీనియర్ ఒక నెగిటివ్ రోల్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ మూవీ చూసేయాలి అనే కోరిక పుడుతుంది. అయితే ఈ మూవీ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఒకటి ఆహా, రెండు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మై నేమ్ ఈజ్ శ్రుతి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్ వర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి.. హన్సిక నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.