Tirupathi Rao
OTT Suggestions- Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కి ఈ మూవీ ఒక ఉదాహరణ అని చెప్పాలి.
OTT Suggestions- Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కి ఈ మూవీ ఒక ఉదాహరణ అని చెప్పాలి.
Tirupathi Rao
ఫహద్ ఫాజిల్ గురించి పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఒక హీరోగానే కాకుండా.. విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా విలక్షణ నటనతో సినిమా ప్రేక్షకుల నుంచే కాకుండా.. క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఇంక పుష్ప సినిమాతో ఆ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాడు. ఫహద్ ఫాజిల్ నటనకు పాన్ ఇండియా లెవల్లో అప్లాజ్ దక్కింది. అయితే ఫహద్ ఫాజిల్ అసలు తనలో ఉన్నా టాలెంట్ ని చూపించిన సినిమా ఇంకొకటి ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ, ఆ సినిమాలో ఫహద్ నటనకు ఎంతటి వారైనా ఫిదా అయిపోతారు.
ఫహద్ ఫాజిల్ పేరు తరచూ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి విలక్షణమైన పాత్ర ఉన్నా కూడా ఫహద్ యాక్టింగ్ తో ఇరగదీస్తాడు. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా ఎంత వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ గురించి ఇంకా ఓటీటీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒక డాన్ గా ఫన్నీ వేలో ఫహద్ చేసిన యాక్టింగ్ అందరి మన్ననలు పొందింది. అయితే ఈ మూవీలో ఫహద్ యాక్టింగ్ కి ఫిదా అవుతున్న ఆడియన్స్ కి ఇంకో విషయం తెలియాలి. అదేంటంటే.. ఆవేశం సినిమా కంటే ఒక తోపు సినిమా గతంలోనే ఫహద్ చేశాడు. అందులో అతని యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఫహద్ ఫాజిల్ ఒక మోటివేషనల్ స్పీకర్, దైవాంశ సంభూతుడి పాత్రలో నటించిన సినిమా ఇది. ఆ సినిమాలో ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఎందుకు పనికిరాడు అనుకున్న వాడిని ఈ సమాజాన్ని సక్సెస్ ఫుల్ గా మోసం చేసేందుకు పంపిస్తారు. ఒకచోట ఉంచి పక్కగా ట్రైనింగ్ ఇచ్చి.. మనుషుల విశ్వాసాలతో ఆడుకునేందుకు పంపిస్తారు. దేవుడు అనే ఒక పేరును అడ్డు పెట్టుకుని కొందరు చేసే అరాచకాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫహద్ ఫాజిల్ ఒక దొంగ పాస్టర్ల దగ్గర మోటివేషనల్ స్పీకర్ గా ఆ దేవుడి దూతగా నటించేందుకు ట్రైయినింగ్ తీసుకుంటాడు.
ఆర్టిస్టుల సాయంతో తాను ఏదో ప్రజల జీవితాలను మార్చేస్తున్నాను అంటూ కలరింగ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వారిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ మాత్రమే కాదు.. కథ, టేకింగ్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఒక్కో సీన్ కి ఎమోషనల్ అయిపోతారు. మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేరు. మీకు తెలియకుండానే ఏడ్చేస్తూ ఉంటారు. ఈ సినిమా పేరు ట్రాన్స్. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.