OTTలో ది బెస్ట్ సర్వైవల్ డ్రామా ‘నో ఎగ్జిట్’.. ఒక్కో సీన్ కి వణికిపోతారు..

OTT Suggestions- Best Thriller No Exit Movie: ఓటీటీలో మీరు మంచి సినిమాలు చూడాలి అనుకుంటారు. కానీ, కొన్నిసార్లు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నచ్చదు. అయితే మీకోసం ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాం. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం.

OTT Suggestions- Best Thriller No Exit Movie: ఓటీటీలో మీరు మంచి సినిమాలు చూడాలి అనుకుంటారు. కానీ, కొన్నిసార్లు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నచ్చదు. అయితే మీకోసం ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాం. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం.

థ్రిల్లర్స్, డ్రామాలలో ఆడియన్స్ ని ఎక్కువ మెప్పించే చిత్రాలు సర్వైవల్ థ్రిల్లర్స్. అలాంటి ఒక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామాని మీకోసం తీసుకొచ్చాం. ఇందులో డ్రామా ఉంటుంది. యాక్షన్ ఉంటుంది. వెన్నులో వణుకు పుట్టించే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఈ సినిమాని స్టార్ట్ చేశాక.. తర్వాత ఏం జరగబోతోంది అనే ఆసక్తి మీలో రెట్టింపు అవుతుంది. ఈ సినిమాలో ఉండేవాళ్లు అంతా ఒకరికి ఒకరు పరిచయం లేనివాళ్లే ఉంటారు. ఒకరికి ఒకరు తెలియనప్పుడు ఒక విధమైన భయం ఏర్పడుతుంది. ఆ భయమే ఈ మొత్తం కథని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా ఒక సర్వైవల్ డ్రామానే కాదు.. ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కూడా. హీరోయిన్ ఒక కాలేజ్ స్టూడెంట్. ఆమె వేరే ప్రాంతంలో ఉంటూ ఉంటుంది. ఆమె తల్లికి ఆరోగ్యం బాలేదు అని ఫోన్ వస్తుంది. అది మొత్తం పర్వతప్రాంతం. పైగా మంచు కురుస్తూ ఉంటుంది. మంచు తుపాను హెచ్చరికలు కూడా ఉంటాయి. అక్కడి వాళ్లు చెప్పినా వినకుండా కారు తీసుకుని తన తల్లిని చూసేందుకు బయల్దేరుతుంది. అయితే మంచు తుపాను కారణంగా హైవేని బ్లాక్ చేస్తారు. హైవే రెస్ట్ స్టాప్ లో తుపాను తగ్గే వరకు బస చేయాలని చెబుతారు. చేసేది లేక హీరోయిన్ ఆ రెస్ట్ స్టాప్ కు వెళుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

ఆ రెస్ట్ స్టాప్ లో వైఫై కూడా ఉంటదు. తన తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆ యువతి బయటకు వచ్చి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో బయట ఆగి ఉన్న కార్లలో ఒక వ్యాన్ లో చిన్న పాపని చూస్తుంది. ఆ పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తి రెస్ట్ స్టాప్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు. అసలు ఆ వ్యక్తి ఎవరు అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటుంది. అలాగే ఆ చిన్నారిని ఎలాగైనా కాపాడాలి అని ఫిక్స్ అవుతుంది. అక్కడున్న వారికి ఒకరిపై ఒకరికి అసలు నమ్మకం ఉండదు. అంతేకాకుండా.. ఆ కడ్నాపర్ ఎవరు అని తెలుసుకునే క్రమంలో వీళ్లు కొట్టుకునే వరకు వెళ్తారు. అంతేకాకుండా.. వారిలో వాళ్వు చంపుకునే వరకు వెళ్తారు. మరి.. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఆ ఐదుగురిలో కిడ్నాపర్ ఎవరు? హీరోయిన్ ఆ చిన్నారిని కాపాడిందా? తెలియాలి అంటే మీరు ఈ “నో ఎగ్జిట్” అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments