రియల్ లైఫ్ మోసంపై మూవీ.. OTTలో ఈ థ్రిల్లర్ కి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Best Thriller A Simple Favour: ఓటీటీలో మంచి థ్రిల్లర్ కోసం గనుక మీరు చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి. అలాగే రియల్ లైఫ్ లో జరుగుతున్న క్రైమ్ కి సంబంధించి ఒక మంచి స్టోరీ ఉంటుంది.

OTT Suggestions- Best Thriller A Simple Favour: ఓటీటీలో మంచి థ్రిల్లర్ కోసం గనుక మీరు చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి. అలాగే రియల్ లైఫ్ లో జరుగుతున్న క్రైమ్ కి సంబంధించి ఒక మంచి స్టోరీ ఉంటుంది.

ఎన్ని సినిమాలు చూసినా.. ఎలాంటి సినిమాలు చూసినా.. థ్రిల్లర్స్ చూస్తే వచ్చే కిక్కు నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సరైన కథ మీకు తగిలితే అసలు నిద్ర కూడా పోలేరు. ఇప్పుడు మీకోసం ఓటీటీ సజీషన్ రూపంలో అలాంటి ఒక సినిమానే తీసుకొచ్చాం. అది కూడా అలాంటి ఇలాంటి కథ కాదు. ఒక్కో ట్విస్టుకు పిచ్చెక్కిపోవాల్సిందే. అంతేకాకుండా ఇందులో కొన్ని స్కామ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇప్పుడు తరచుగా వినే ఇన్సూరెన్స్ స్కామ్ తాలుకా ఆనవాళ్లు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. కానీ, దాని చుట్టూ తిరిగే డ్రామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక్క మహిళ కోసం మొత్తం సిటీ పోలీసులు అంతా పరిగెడతారు.

ఈ సినిమాలో మన హీరోయిన్ ఒక గొప్పించి మహిళ. తన మెయిన్టినెన్స్, ప్రవర్తన, అలవాట్లు అన్నీ వేరే లెవల్లో ఉంటాయి. అలాంటి ఒక మహిళ.. యూట్యూబ్ వీడియోస్ చేసే మరో మహిళతో ఫ్రెండ్ షిప్ స్టార్ట్ చేస్తుంది. నిజానికి ఆమెను చూసి ఈ యూట్యూబ్ వ్లాగర్ మనసు పారేసుకుంటుంది. ఆమె ఆహార్యం చూసి మెస్మరైజ్ అయిపోతుంది. ఆ తర్వాత వారి మధ్య మాటలు కలుస్తాయి. మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఎప్పుడూ ఆమె తనని ఫొటోలు తీయడం, నలుగురికి పరిచయం చేయడం మాత్రం చేయనివ్వదు. తన భర్త, పిల్లలకు బాగా దగ్గరయ్యేలా చేస్తుంది. అలాగే వీరి మధ్య స్నేహం కూడా బలపడుతుంది.

రెగ్యూలర్ గా కలవడం, మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. కానీ, ఒకరోజు ఆ మహిళ.. యూట్యూబర్ కు ఫోన్ చేసి ఒక చిన్న ఫేవర్ కావాలి అని అడుగుతుంది. తన ఇంటికి వెళ్లమని చెప్తుంది. అయితే అక్కడ ఆమె ఉండదు. ఎంత వెతికినా కనిపించదు. పోలీసులు పెద్ద పెద్ద టీమ్స్ ని పెట్టుకుని మరీ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు. కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఆమె మిస్సింగ్ వెనుక పెద్ద కథే ఉంటుంది అనే అనుమానం వస్తుంది. ఆమె కనిపించకుండా పోవడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆమె భర్త ఇన్సూరెన్స్ చేయిస్తాడు. ఆ తర్వాతే ఆమె కనిపించకుండా పోతుంది. ఇక్కడే అసలు డౌటు వస్తుంది. మనం ప్రస్తుతం సమాజంలో కూడా ఇలాంటివి చూడనే చూశాం. ఇన్సురెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం ఆడటం చూశాం. అయితే ఇది కూడా ఇంచుమించు అలాంటి కథలాగానే అనిపిస్తుంది. కానీ, అంతకు మించిన ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమా పేరు “ఏ సింపుల్ ఫేవర్“. ఇది లైన్స్ గేట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు అమెజాన్ లో అయితే రూ.119 రెంట్ తో ఈ సినిమా చూడచ్చు. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments