OTT Suggestions- The Best Horror Thriller: 18 ఏళ్లు అవుతున్నా దీన్ని బీట్ చేసే హారర్ సినిమా రాలేదు.. OTTలో ఉంది చూశారా?

18 ఏళ్లు అవుతున్నా దీన్ని బీట్ చేసే హారర్ సినిమా రాలేదు.. OTTలో ఉంది చూశారా?

OTT Suggestions- Best Horror Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ మంచి సినిమాలు చూడాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.

OTT Suggestions- Best Horror Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ మంచి సినిమాలు చూడాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.

మీకు హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందా? అది చాలా మంచి అలవాటే. కానీ, అంత మంచి సినిమాలు దొరకడం మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి హారర్ సినిమా బెస్ట్ అనడానికి ఉండదు. ప్రతి హారర్ సినిమాని బెస్ట్ గా తీయడం కూడా కుదరదు. అందుకే ఓటీటీలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఒక దాన్ని మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమా చూస్తే మీరు పిచ్చోళ్లు అయిపోతారు. అరె.. ఇంత మంచి సినిమాని ఇన్ని రోజులు చూడలేదా అని కాస్త బాధ్ కూడా పడతారు. అయితే ఈ సినిమా వచ్చి ఏకంగా 18 ఏల్లు కావొస్తోంది. కానీ, ఇప్పటికీ దీని రేంజ్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ రాలేదు అంటే నమ్ముతారా?

హాలీవుడ్ లో మీకు చాలానే క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ తగులుతూనే ఉంటాయి. కానీ, అన్నీ ది బెస్ట్ గా మాత్రం అనిపించవు. అందుకే అలాంటి సినిమాలు వెతుకున్న మీకోసం మేము ఒక సజీషన్ రూపంలో ఒక బెస్ట్ మిస్టరీ హారర్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన తర్వాత మీక హారర్ సినిమాల మీద అభిప్రాయమే మారిపోతుంది. ఇది కంప్లీట్ హారర్ చిత్రం కూడా కాదు. కాకపోతే హారర్ ఎలిమెంట్ అనేది మీకు కథలో కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా పూర్తిగా చూసిన తర్వాత అరె ఎందుకు ఇలాంటి కథలను మన దగ్గర తీయరు అని ప్రశ్న కూడా పుడుతుంది. పైగా ఈ సినిమా చాలానే హారర్ చిత్రాలకు రిఫరెన్స్ గా కూడా ఉంది.

ఈ సినిమాలో ఒక మిస్టరీ ప్లేస్ ఉంటుంది. అంతా వెకేషన్ కి వెళ్లే దారి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. అటుగా వెళ్లే టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉంటారు. వారి వెహికల్స్ కి పంచర్ చేస్తారు. అయితే ఆ పంచర్ చేయడం వల్ల వాళ్ల కార్లు అక్కడే ఆగిపోతాయి. అలా ఆగిన తర్వాత వాళ్లు వారి వేటను స్టార్ట్ చేస్తారు. వారి క్యారీవేన్ లో ఉన్న మనుషులను టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి వారి స్థావరాలకు తీసుకెళ్తారు. అక్కడ వారికి ప్రత్యక్షంగా నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉంటారు. నిజానికి అక్కడ బతికి ఉండటం కంటే కూడా చచ్చిపోవడం చాలా బెటర్ గా అనిపిస్తుంది.

అందుకే ఆ మూవీలో అక్కడ ముందుగా చనిపోయిన వాళ్లే అదృష్టవంతులు అని చెప్తారు. అంటే వారి టార్చర్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అలాంటి ప్రాంతంలో చిక్కున్న వారి పరిస్థితి ఏంటి? వారిని ఎలా హింసలు పెడతారు? అసలు అలా హింసించేది ఎవరు? అనే పాయింట్స్ మీద ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ఈ సినిమా పేరు “ది హిల్స్ హ్యావ్ ఐస్”. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 2006లోనే విడుదల అయ్యింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో వైలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి పిల్లలతో చూడకపోవడమే బెటర్. ఇప్పటికే ఈ సినిమా చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments