OTT Suggestions- Horror Movie Jennifer's Body: అందం చూపించి అబ్బాయిలను చంపేసే రాక్షసి.. OTTలో డేంజర్ మూవీ!

అందం చూపించి అబ్బాయిలను చంపేసే రాక్షసి.. OTTలో డేంజర్ మూవీ!

OTT Suggestions- Best Horror Movie Jennifer's Body: చూడటానికి స్కూల్ పిల్ల. ఎంతో అందంగా ఉంటుంది. సరే పిలిచింది కదా అని వెనక వెళ్తే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది. ఓటీటీలో ఈ మూవీకి హడలెత్తిపోతారు.

OTT Suggestions- Best Horror Movie Jennifer's Body: చూడటానికి స్కూల్ పిల్ల. ఎంతో అందంగా ఉంటుంది. సరే పిలిచింది కదా అని వెనక వెళ్తే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది. ఓటీటీలో ఈ మూవీకి హడలెత్తిపోతారు.

ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని రకాల సినిమాలు చూడాలి అనుకుంటున్నారు. ఆ లిస్టులో కచ్చితంగా హారర్ కూడా ఉంటుంది. అయితే ఇది మాత్రం కాస్త అందమైన హారర్ చిత్రం. అంటే భయపెడుతూ చూడాలి అని ప్రేరేపించే అందమైన సినిమా అనమాట. ఇదంతా ఒక స్కూల్లో జరుగుతూ ఉంటుంది. ఆ స్కూల్ లో అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా అసూయపడే అందంతో ఒక అమ్మాయి ఉంటుంది. అంతా ఆమె అందానికి ఫిదా అయిపోతారు. ఒక్కసారి అయినా అమ్మాయిలో ఫ్రెండ్ షిప్ చేయాలి అనుకుంటారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం చాలా సెలక్టివ్ గా ఫ్రెండ్ షిప్ చేస్తూ ఉంటుంది. మరి.. ఆ సినిమా ఏది? అందులో ఉన్న సారాంశం ఏంటో చూద్దాం.

సాధారణంగా హైస్కూల్ లో స్టూడెంట్స్ మధ్య ప్రేమకథలు ఉండటం సహజం. అలాంటి పాయింట్స్ మీద సినిమాలు కూడా వచ్చాయి. అదే విదేశాల్లో ఉండే స్కూల్స్ లో అయితే ప్రేమకథలకు మించే జరుగుతున్నట్లు చాలా హాలీవుడ్ సినిమాల్లో చూపించారు. ఈ సినిమాలో కూడా అలాంటి విషయాలే ఉంటాయి. ఆ స్కూల్ లో ఉండే అమ్మాయి అంటే అంతా పడి చచ్చిపోతారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆమె కన్ను పడితే చచ్చిపోతారు. ఎందుకంటే ఆమె మనిషి కాదు రాక్షసి. తన అందాన్ని ఎరగా వేసి స్కూల్లో ఉండే అబ్బాయిలను తన ప్రదేశానికి తీసుకెళ్లి హత్యలు చేస్తూ ఉంటుంది.

అయితే ఈ రాక్షసి స్కూల్లో ఉండే ఒక అమ్మాయితో మాత్రం స్నేహం చేస్తుంది. ఆమెను తీసుకెళ్లి తనలో ఉన్న కోరి*కలు తీర్చుకోవడానికి చూస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి మాత్రం వెళ్లకపోతే చంపేస్తుందనే భయంతో ఆమె చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉంటుంది. కానీ, విద్యార్థలను చంపే విషయంలో మాత్రం ఆ రాక్షసిని నిలదీస్తూ ఉంటుంది. ఒకసారి వారి మధ్య గొడవ కూడా జరుగుతుంది. ఆ రాక్షసి అప్పటి వరకు అబ్బాయిలను మాత్రమే చంపుతూ ఉంటుంది. ఈసారి మాత్రం ఆ అమ్మాయిని కూడా చంపేందుకు రెడీ అయిపోతుంది.

అయితే అలా ఎందుకు మారిపోయింది? అసలు ఆ రాక్షసి అంత అంతమైన అమ్మాయిలా ఎలా మారగలుగుతుంది? ఎందుకు అలా అబ్బాయిలను చంపుతూ ఉంటుంది? అసలు ఈ రాక్షసిని ఆపే మార్గం ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు కచ్చితంగా ఈ జెన్నీఫర్స్ బాడీ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కాకపోతే ఈ మూవీని చూడాలంటే రూ.119కు రెంట్ కి తీసుకోవాల్సి ఉంటుంది. కథ, టేకింగ్ పరంగా మాత్రం ఈ మూవీకి ఫిదా అయిపోతారు. ఈ మూవీ చూసేందుక్ క్లిక్ చేయండి.

Show comments