ఆంటీ మోజులో పడి అబ్బాయి జీవితం నాశనం.. OTT లోమెసేజ్ ఇచ్చే మూవీ!

OTT Best Message Oriented Movie: ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలతో పాటు.. అబ్బాయిలు కూడా రకరకాల మోసాలకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి ఓ సినిమా గురించే. ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Message Oriented Movie: ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలతో పాటు.. అబ్బాయిలు కూడా రకరకాల మోసాలకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి ఓ సినిమా గురించే. ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

కొద్దిసేపు మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ , సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను పక్కన పెట్టేస్తే.. ఓటీటీ లో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలతో పాటు.. అబ్బాయిలు కూడా రకరకాల ట్రాప్స్ కు గురౌతున్నారు. కానీ ఎవరికీ చెప్పుకోలేక చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ అక్కడక్కడా చూస్తూనే ఉంటున్నాము. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో పంజాబీ కుటుంబంలో జరిగే కర్మ కాండాలను చూపిస్తారు. ఓ అనుకోని ప్రమాదంలో ఆ కుటుంబంలోని భార్య భర్తలు ఇద్దరు మరణిస్తారు. వారికి ఒక కొడుకు ముకేష్ , ఇద్దరు కూతుళ్లు ఉంటారు. ఇప్పుడు వారు ముగ్గురు అనాధలు అయిపోతారు. ఆ పిల్లల తాతయ్య , అత్త మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు. అమ్మాయిల బాధ్యత తాతయ్య , అబ్బాయి బాధ్యత అత్త చేసుకుంటుం ఉంటారు. కానీ అత్త మాత్రం ఆ అబ్బాయిని చులకనగా చూస్తూ.. ఇంటి పనులు చేయిస్తూ… తిండి పెట్టకుండా.. పని వాడికంటే దారుణంగా చూస్తుంది. ఈ క్రమంలో వాళ్ళ అత్త ఫ్రెండ్ రేవతి ముకేశ్ పై కన్నేస్తుంది. ఓ రోజు అతనిని ఇంటికి పిలిచి మరి.. అతనిని శారీరకంగా కలుస్తూ..అతని మైండ్ పాడుచేస్తుంది. ముకేశ్ కు ఇదంతా ఏమి అర్థంకాదు. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలీదు.

కట్ చేస్తే అతను రోజు చదువుకోడం కోసం ఓ స్మశానానికి వద్దకు వెళ్తాడు. అక్కడ ఓ వ్యక్తి ముకేశ్ కు పరిచయం అవుతాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. మరోవైపు రేవతి ఆంటీ రోజు ముకేశ్ ను తన ఇంటికి పిలిపించి కలుస్తుంది. అతనితో ఇంటిమేట్ అవుతూ.. చివరికి ఆమెకు బానిస అయ్యేలా చేస్తుంది. మెల్లగా ముకేశ్ బిహేవియర్ లో తేడా వస్తుంది. ఇదంతా వాళ్ళ అత్త గమనిస్తుంది. కానీ వాళ్ళత్త కు అబద్దం చెప్తాడు. కొన్ని రోజులకు అతని తాతయ్య చనిపోడంతో.. చెల్లెళ్ళ బాధ్యత ముకేశ్ మీద పడుతుంది. దీనితో రేవతి హెల్ప్ అడుగుతాడు. ఆమె అతనిని ఓ అమ్మాయి ఇంటికి పంపిస్తుంది.

అక్కడ ఆ అమ్మాయి కూడా ఇతనిని వాడుకుని డబ్బు ఇస్తుంది. ముకేశ్ కు ఇష్టం లేకపోయినా సరే.. డబ్బు కోసం ఒప్పుకుంటాడు. అయితే వాళ్ళ చెల్లెల్లు ఇద్దరు ఉండే హాస్టల్ లో ఉంటారు. అక్కడ వార్డెన్ అమ్మాయిలను అమ్మేస్తూ ఉంటుంది. దీనితో ముకేశ్ వాళ్ళ చెల్లెళ్లను కాపాడడం కోసం ఆ హాస్టల్ వార్డెన్ కు వార్నింగ్ తో పాటు కొంత డబ్బు ఇచ్చి వచ్చేస్తాడు. అయితే ఆ తర్వాత ముకేశ్ కు ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. అక్కడి నుంచి అతని జీవితం మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? ముకేశ్ అత్తకు అతని విషయం తెలుస్తుందా లేదా ? ఈ కథ ఎలా ముందుకు సాగింది ? రేవతి ముకేశ్ ను ఎలా వాడుకుంది ? వాళ్ళ చెల్లెళ్ళ బాధ్యత తీసుకుంటాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే బి.ఏ పాస్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి.. భర్త ఊరిలో లేని సమయంలో ఫ్రెండ్ తో భార్య ఆ పని! OTT లో ఈ మూవీ అన్ని ట్విస్ట్ లే !

Show comments