iDreamPost
android-app
ios-app

మనుషులని నరికి మనుషులకే వండి పెడతాడు. OTT లో సైకో కిల్లర్ మూవీ

  • Published Jul 10, 2024 | 2:47 PM Updated Updated Jul 10, 2024 | 2:47 PM

OTT Best Psycho Thriller Movie: సైకో థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు కాస్త భయపెట్టిన కూడా.. ఎండ్ వరకు కదలకుండా కూర్చుని చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Psycho Thriller Movie: సైకో థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు కాస్త భయపెట్టిన కూడా.. ఎండ్ వరకు కదలకుండా కూర్చుని చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 10, 2024 | 2:47 PMUpdated Jul 10, 2024 | 2:47 PM
మనుషులని  నరికి మనుషులకే వండి పెడతాడు. OTT లో సైకో కిల్లర్ మూవీ

అసలు సైకో థ్రిల్లర్ మూవీస్ అర్థంచేసుకోడం అంత ఈజీ కాదు. చివరి వరకు కూడా కిల్లర్ ఎందుకు చంపుతున్నాడో తెలియదు. పోలీసులు అతనిని పెట్టుకుంటారో లేదో తెలియదు. ప్లాట్స్ అన్ని ఒకటే అయినా కూడా.. కథలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. పైగా ఈ మూవీ లో సైకో కిల్లర్ కు తినాలనే ఆలోచించే పార్ట్నర్ కూడా ఉంటుంది. తనకు గతంలో ఉండే విషాదాన్ని గుర్తుపెట్టుకుని మరి ఆ మనిషి సైకో కిల్లర్ గా మారితే ఎలాంటి మర్డర్స్ చేస్తాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అచ్చం అలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ చిన్న టౌన్ లో రైట్ మార్ట్ అనే ఓ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ లో ప్రతి సంవత్సరం థాంక్స్ గివింగ్ సమయంలో.. ఓ సేల్ జరుగుతుంది. ఆ సేల్ కోసం టౌన్ లో ఉండే ప్రజలంతా కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే ఓసారి థాంక్స్ గివింగ్ సేల్ లో తొక్కిసలాట జరగడం వలన కొంతమంది చనిపోతారు. దీనితో ఆ మార్ట్ పేరు అంతటా మారుమోగిపోతుంది. పైగా అప్పటినుంచి ఆ టౌన్ లో హత్యలు కూడా మొదలవుతాయి. ముందు ఆ మార్ట్ లో పని చేసే లిజ్జి అనే వెయిటర్ హత్యకు గురవుతుంది. ఎవరో ఓ వ్యక్తి మాస్క్ వేసుకుని ఆమెను చంపేశాడని పోలీసులు గుర్తిస్తారు. కొద్దీ రోజులకు సోషల్ మీడియాలో ఘోరమైన పోస్ట్స్ పెడుతూ.. ఆ మార్ట్ ఓనర్ జెస్సికా ను టాగ్ చేస్తాడు.

ఆమెకంటే ముందు మరికొంతమందిని కిడ్నప్ చేసి చంపేస్తాడు. జెస్సికా కుటుంబం నుంచి ఒక్కక్కరిని కిడ్నప్ చేసి.. అందరికి తెలిసేలానే చంపేస్తూ ఉంటాడు. జెస్సికా తల్లినైతే దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్ చేస్తాడు. అదే వంటను తాను కిడ్నప్ చేసిన వారికి పెడతాడు. అసలు ఎవరు ఆ సైకో కిల్లర్ ? ఎందుకు ఇలా చంపేస్తున్నాడు ? ఎందుకు మార్ట్ ఓనర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు ? చివరికి ఏం జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే “థాంక్స్ గివింగ్” అనే ఈ మూవీని చూడాల్సిందే. కాస్త డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఈ మూవీ ఎవరు చూడకపోతే.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.