iDreamPost
android-app
ios-app

OTT Suggestion: OTT లో డిఫరెంట్ కామెడీ వెబ్ సిరీస్.. ఇన్ని రోజులు దీన్నెలా మిస్ చేశారు!

  • Published Jul 02, 2024 | 1:45 PM Updated Updated Jul 02, 2024 | 1:45 PM

Best Comedy Series In OTT : వెబ్ సిరీస్ లంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్ లంటే కేవలం హర్రర్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఏ కాదు.. కామెడీ వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ వెబ్ సిరీస్ గురించే..

Best Comedy Series In OTT : వెబ్ సిరీస్ లంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్ లంటే కేవలం హర్రర్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఏ కాదు.. కామెడీ వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ వెబ్ సిరీస్ గురించే..

  • Published Jul 02, 2024 | 1:45 PMUpdated Jul 02, 2024 | 1:45 PM
OTT Suggestion: OTT లో డిఫరెంట్  కామెడీ  వెబ్ సిరీస్.. ఇన్ని రోజులు దీన్నెలా మిస్ చేశారు!

వెబ్ సిరీస్ లను అందరూ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు.. కేవలం హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లనే కాకుండా కామెడీ వెబ్ సిరీస్ లను కూడా ఆదరించడం మొదలుపెట్టారు మూవీ లవర్స్. ఇక మలయాళ సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను చూసి ఉంటారు కానీ ఇలాంటి కామెడీ వెబ్ సిరీస్ ను మాత్రం అసలు చూసి ఉండరు. కేవలం లవ్ డ్రామాస్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ కాకుండా కామెడీ కంటెంట్ ను తీయడంలోనూ తమదే పై చేయి అని నిరూపిస్తున్నాయి మలయాళీ సినిమాలు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే మలయాళీ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే… ఈ సిరీస్ కథ అంతా కూడా.. మాళవిక అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మాళవిక చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తన మేనమామ దగ్గర ఉంటూ.. చదువుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అదే స్కూల్ లో చదువుతున్న శ్రీకుంటన్ అనే అన్నాయిని ఇష్టపడుతుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె సొంత ఊరికి వెళ్లిపోవడంతో శ్రీకుంటన్ ఆమె జ్ఞాపకాలతోనే ఉండిపోతాడు. కొన్నాళ్ల తర్వాత… మాళవిక . పీహెచ్ డీ చేసే ప్రయత్నాల్లో ఉంటుంది. శ్రీకుంటన్ కూడా ‘గల్ఫ్’ లో జాబ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే వీరిద్దరికే పెళ్లి చూపులు జరుగుతాయి. అయితే మాళవిక ఆలోచనలలో ఏ మార్పు లేకపోయినా కూడా.. శ్రీకుంటన్ లో మాత్రం మార్పు వస్తుంది. బాగా డబ్బు ఉన్న అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవాలని అతను అనుకుంటాడు.

దీనితో శ్రీకుంటన్ మాళవికకు నో చెప్తాడు. ఈలోపే ఎలాగూ శ్రీకుంటన్ ను పెళ్ళి చేసుకుని అదే ఊరికి వస్తుందనే ఆలోచనతో.. తన మేనమామ ఆమెను ఆ ఊరి ప్రెసిడెంట్ ను చేస్తాడు. ఆమె పేరుతో ఆ ఊరిలో రాజకీయం చేస్తూ.. అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. అయితే అతని అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించడానికి మరికొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మాళవిక మాత్రం ఆ పదవికి ఎప్పుడెప్పుడు రాజీనామా చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ దానికి వాళ్ళ మేనమామ మాత్రం అడ్డుపడుతూ ఉంటాడు. మరి దానికి ఆమె ఏం చేసింది ! ఆమె మేనమామ చేసిన అరాచకాలు బయటపడతాయా లేదా ! శ్రీకుంటన్ మాళవిక ప్రేమను అర్ధం చేసుకుంటాడా లేదా ! ఆ తర్వాత ఏం జరిగింది ! చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది ! ఇవన్నీ తెలియాలంటే.. “పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే.. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడడం ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş