iDreamPost

OTT Series Suggestion: OTT లో ఇంట్రెస్టింగ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

  • Published Jul 03, 2024 | 2:55 PMUpdated Jul 03, 2024 | 2:55 PM

OTT Telugu Suspense Thriller Series:వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉంటె కనుక ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను అసలు మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ చేస్తే మాత్రం ఓ మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను మిస్ అయినట్లే. మరి ఈ వెబ్ సిరీస్ ను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Telugu Suspense Thriller Series:వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉంటె కనుక ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను అసలు మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ చేస్తే మాత్రం ఓ మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను మిస్ అయినట్లే. మరి ఈ వెబ్ సిరీస్ ను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 03, 2024 | 2:55 PMUpdated Jul 03, 2024 | 2:55 PM
OTT Series Suggestion: OTT లో ఇంట్రెస్టింగ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

ఈ మధ్య సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ లకు బాగా క్రేజ్ పెరిగిపోతుంది. ఎందుకంటే వెబ్ సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ లోను.. ప్రేక్షకుల ఊహకు అందని ఎన్నో ట్విస్ట్ లు ఉంటూ ఉంటాయి. దీనితో తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఆ వెబ్ సిరీస్ మొత్తం పూర్తయ్యే వరకు.. ప్రేక్షకులను అన్ని ఎపిసోడ్స్ చూసేలా చేస్తుంది. పైగా ఒక్కో వెబ్ సిరీస్ రెండు నుంచి మూడు నాలుగు సీజన్స్ వరకు ఉంటాయి. దీనితో చాలా మంది ఓవర్ నైట్ లో అన్ని సీజన్స్ ను కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉంటే కనుక ఇప్పుడు చెప్పుకోబోయి వెబ్ సిరీస్ ను అసలు మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ చేస్తే కనుక ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ వెబ్ సిరీస్ ను మీరు కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

ముందు అసలు ఈ సిరీస్ కథేంటో చూసేద్దాం.. ఈ సిరీస్ లో సంకీత్ అనే అతనికి తన కూతురు మెహ అంటే చాలా ఇష్టం.. అయితే ఉద్యోగం ధ్యాసలో పడి తన కూతురిని సరిగా చూసుకోవడం లేదని.. సంకీత్ తన భార్య సాక్షికి దూరంగా ఉంటాడు. ఈ క్రమంలోనే ఓసారి మెహను తీసుకుని కేరళకు వెళ్తాడు. అక్కడ అనుకోని ప్రమాదంలో పడబోయిన మెహను ఓ అమ్మాయి రక్షిస్తుంది. అయితే ఆమె తన గతాన్ని మర్చిపోయి.. తానేవారో కూడా తనకు తెలియని అమ్మాయి. దీనితో సంకీత్ ఆమెను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆమెకు జాన్సీ అనే పేరు పెడతాడు. కొంతకాలానికి ఆమె మామూలు మనిషి అయిపోతుంది.. ఆమె ఓ బోటిక్ ను కూడా రన్ చేస్తూ ఉంటుంది. అయితే సంకీత్ జాన్సీ ముందు పెళ్లి ప్రపోజల్ పెడతాడు. కానీ జాన్సీకి మాత్రం అప్పుడప్పుడు తన గతానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు.. కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి.

ఎవరైనా అమ్మాయికి అన్యాయం జరిగితే సహించలేకపోవడం , వారిని చంపడానికైనా వెనుకాడకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. జాన్సీ వెనుక బలమైన గతమే ఉందని ఆమె గ్రహిస్తుంది. దీనితో ఆమె తన గతాన్ని ఎలా అయినా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. మరి జాన్సీ ఏ ఆధారాల ద్వారా తన గతాన్ని గుర్తించింది! అసలు గతంలో జాన్సీ ఎక్కడ ఉండేది! జాన్సీ వెనుక ఉన్న బలమైన గతం ఏంటి ! ఆమె కేరళకు ఎలా వచ్చింది ! ఈ క్రమంలో ఆమె ఎలాంటి సమస్యలలో చిక్కుకుంది ! సంకీత్ భార్య సాక్షికి జాన్సీ కి ఏంటి సంబంధం ! ఇవన్నీ తెలియాలంటే “జాన్సీ” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్స్ రీలిజ్ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం… వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి