OTT Best Murder Mystery Series : OTT లో బెస్ట్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. ఈ కథ అస్సలు మీ ఊహకు అందదు

OTT లో బెస్ట్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. ఈ కథ అస్సలు మీ ఊహకు అందదు

OTT Best Murder Mystery Series : వెబ్ సిరీస్ లంటే ఇష్టమైతే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను అసలు మిస్ చేయకండి. అందులోను ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కంప్లీట్ డిఫ్ఫరెంట్ మర్డర్ మిస్టరీ.. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

OTT Best Murder Mystery Series : వెబ్ సిరీస్ లంటే ఇష్టమైతే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను అసలు మిస్ చేయకండి. అందులోను ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కంప్లీట్ డిఫ్ఫరెంట్ మర్డర్ మిస్టరీ.. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు దాదాపు సినిమాల కంటే కూడా.. వెబ్ సిరీస్ లకే క్రేజ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ప్రతి ఎపిసోడ్ లోను ఊహకు అందని ఎన్నో ట్విస్ట్ లు ఉంటూ ఉంటాయి. దీనితో ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తే.. కంప్లీట్ అయ్యేవరకు అసలు వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ప్రేక్షక్షకులకు వెబ్ సిరీస్ ల మీద పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. కొత్త కొత్త కథలతో మేకర్స్ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో కూడా ఈ మధ్య కొత్త వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ వెబ్ సిరీస్ గురించే. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సిరీస్ కథేంటంటే.. ఇదొక మర్డర్ మిస్టరీ.. రుద్రకుండ్ అనే ఊరిలో ఓ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ లో మెహిల్ అనే అబ్బాయిని దారుణంగా చంపేస్తారు. అతనిని చంపేసి ఓ చెట్టుకు గుచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. ఈ మర్డర్ ను కళ్లారా చూసిన అందరు చాలా షాక్ అవుతారు. అయితే మెహిల్ తో పాటు కల్కి అనే అమ్మాయి కూడా కనిపించకుండా పోతుంది. దీనితో అదే స్కూల్ లో ఉండే జయంత్ అనే టీచర్ వీరిద్దరికి బాగా క్లోజ్ అవ్వడంతో.. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించాలని డిసైడ్ అవుతాడు. అతను దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని స్టార్ట్ చేసిన వెంటనే .. ఓ పోలీస్ ఆఫీసర్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. అయినా సరే జయంత్ ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టాలని అనుకుంటూనే ఉంటాడు. ఇంతలో కనిపించకుండా పోయిన కల్కి తిరిగి వస్తుంది. ఆమె జయంత్ కు ఓ కెమెరాను ఇస్తుంది.

ఆ కెమెరాలో ఓ ఎమ్మెల్యే కొడుకు చేస్తున్న డ్రగ్ డీల్ కు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఉంటాయి. మెహిల్ , కల్కి కలిసి ఆ వీడియోను షూట్ చేస్తారు. ఆ నెక్ట్స్ డే నే మెహిల్ చనిపోతాడు. అసలు మెహిల్ ను చంపింది ఎవరు ! కల్కి అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోతుంది! జయంత్ ఈ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడా లేదా ! కల్కి సేఫ్ గానే తిరిగి వస్తుందా ! జయంత్ ఇన్వెస్టిగేషన్ లో అడ్డుపడిన పోలీస్ అతనికి సహకరిస్తాడా లేదా ! డ్రగ్ డీల్ కు సంబంధించి ఇంకా ఏమేం విషయాలు బయటపడతాయి. ఇవన్నీ తెలియాలంటే.. “క్యాండీ” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం జియో సినిమాలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments