iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 4 మలయాళీ సినిమాలు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published Sep 14, 2024 | 11:40 AM Updated Updated Sep 14, 2024 | 11:40 AM

OTT Malayalam Movies Available In Telugu: మలయాళీ మూవీస్ తెలుగు ప్రేక్షకులను కూడా యిట్టె మెప్పించేస్తున్నాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ వారం ఏకంగా నాలుగు మలయాళీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పైగా అవి తెలుగులో కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఆ సినిమాలేంటో చూసేద్దాం.

OTT Malayalam Movies Available In Telugu: మలయాళీ మూవీస్ తెలుగు ప్రేక్షకులను కూడా యిట్టె మెప్పించేస్తున్నాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ వారం ఏకంగా నాలుగు మలయాళీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పైగా అవి తెలుగులో కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఆ సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Sep 14, 2024 | 11:40 AMUpdated Sep 14, 2024 | 11:40 AM
ఈ వారం OTT లో 4 మలయాళీ సినిమాలు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ప్రతి వారం ఓటీటీ లో మంచి కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంది. పైగా వారం వారం స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అందులోను తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడం విశేషం. ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలలో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలను చూస్తుంటారు కాబట్టి.. కంటెంట్ ఉన్న అన్ని సినిమాలు బాగానే హిట్ అవుతూ ఉంటాయి. ఇక వాటిలో మలయాళీ సినిమాలు ప్రేక్షకులను యిట్టె మెప్పించేస్తున్నాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ వారం ఏకంగా నాలుగు మలయాళీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పైగా అవి తెలుగులో కూడా అందుబాటులో ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

తలవన్:

మలయాళీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే కాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ “తలవన్” సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వీకెండ్ ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సెప్టెంబర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాబట్టి ఇంకా ఈ మూవీ ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

నునకుళి:

కామెడీ చిత్రాలను ఏ రకంగా ఇష్టపడుతూ ఉంటారో.. క్రైమ్ చిత్రాలను కూడా అదే రేంజ్ లో బజ్ నడుస్తూ ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ ఏ ఈ సినిమా. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ, సిద్ధిఖీ, బైజూ సంతోష్, నిఖిల విమల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ పర్సనల్ ల్యాప్ టాప్ ను ఐటీ అధికారి సీజ్ చేయగా.. అందులో అతని భార్య , అతనికి సంబంధించిన వ్యక్తి గత వీడియోస్ ఉంటాయి. దానిని ఆ వ్యక్తి తిరిగి దక్కించుకునే ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

పట్టపాకల్:

కొన్ని సినిమాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా ఈ వారం సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక డార్క్ కామెడీ చిత్రం. ఆగష్టు 27న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో జానీ ఆంటోనీ, ఆషిక అశోకరన్, కృష్ణ శంకర్, రమేశ్ పిషరోడీ, సుధి కొప్ప ముఖ్య పాత్రలు పోషించారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం.. ఈ వీకెండ్ ఈ మూవీ బెస్ట్ ఛాయిస్.

విశేషం :

ఇప్పుడు ఫ్యామిలీ తో కలిసి కూర్చుని చూసే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఆనంద్ మధుసూధన్, చిన్ను చాందినీ, బైజూ జాన్సన్, అల్తాఫ్ సలీమ్, జానీ ఆంటోనీ, పీపీ కున్నికృష్ణమ్ ముఖ్య పాత్రలలో నటించారు. జూలై 19న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా..ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఆలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş