iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి యాక్షన్ కామెడీ మూవీ ‘పొలైట్ సొసైటీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 28, 2024 | 3:52 PM Updated Updated Aug 28, 2024 | 3:52 PM

OTT New Release-Comedy Action Thriller Polite Society :ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా.. ఓటీటీ లో సడెన్ గా స్ట్రీమింగ్ అయ్యే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT New Release-Comedy Action Thriller Polite Society :ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా.. ఓటీటీ లో సడెన్ గా స్ట్రీమింగ్ అయ్యే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Aug 28, 2024 | 3:52 PMUpdated Aug 28, 2024 | 3:52 PM
సడెన్ గా OTT లోకి యాక్షన్ కామెడీ మూవీ ‘పొలైట్ సొసైటీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఎలాగూ భాషా బేధం లేకుండా ఓటీటీ లోకి వచ్చే సినిమాలన్నిటిని చూస్తున్నారు కాబట్టి.. వచ్చే సినిమా కథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే దానిపైనే.. మేకర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాగా బజ్ ఉన్న సినిమాలకు ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. కొన్ని సినిమాలను మాత్రం సడెన్ గా స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చేస్తున్నారు. ఇలా ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో.. ఒక్కోసారి ప్రేక్షకులు ఆ సినిమాలను మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి వారి కోసమే ఈ రిమైండర్. ఈ వారం సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. వాటిలో కొత్తగా మరొక సినిమా యాడ్ అయింది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు పొలైట్ సొసైటీ.. ఇదొక వుమెన్ ఓరియెంటెడ్ కామెడీ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గత సంవత్సరం థియేటర్ లో విడుదలయ్యి.. విమర్శకులు నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు నిదా మంజూరు దర్శకత్వం వహించగా.. ఈ మూవీలో ప్రియా ఖన్సారా, రితూ ఆర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా.. సడెన్ గా ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం హిందీ , ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎలాగూ తెలుగుకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి .. త్వరలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేకపోలేదు.

ఇక పొలైట్ సొసైటీ.. సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియా ఖన్సారా.. టాప్ స్టంట్ పెర్ఫార్మర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ క్రమంలో తన సిస్టర్ కు ఇష్టం లేని పెళ్లిని కూడా ఆపే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటిని ఏ విధంగా ఎదుర్కొంది? చివరకు ఆమె అనుకున్నది సాధించిందా లేదా అనేదే ఈ మూవీ. ఇప్పుడు ఎలాగూ కామెడీ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి.. ఈ వీకెండ్ ఓ మంచి యాక్షన్ కామెడీ చూడాలంటే మాత్రం ఈమూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş