iDreamPost
android-app
ios-app

దేవుడి పేరిట మోసాలు.. OTTలో కడుపుబ్బా నవ్వించే మూవీ!

  • Published Jul 10, 2024 | 4:44 PM Updated Updated Jul 10, 2024 | 4:44 PM

OTT Best Comedy Drama : కామెడీ మూవీస్ చూడడం అంటే అందరికి ఇష్టమే. ఎందుకంటే ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ కూడా అయితే భయపెట్టేవి లేదా వాచ్ ఎలోన్ మూవీస్ ఏ ఉన్నాయి. కాబట్టి ఓ మంచి కామెడీ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి.

OTT Best Comedy Drama : కామెడీ మూవీస్ చూడడం అంటే అందరికి ఇష్టమే. ఎందుకంటే ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ కూడా అయితే భయపెట్టేవి లేదా వాచ్ ఎలోన్ మూవీస్ ఏ ఉన్నాయి. కాబట్టి ఓ మంచి కామెడీ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి.

  • Published Jul 10, 2024 | 4:44 PMUpdated Jul 10, 2024 | 4:44 PM
దేవుడి పేరిట మోసాలు.. OTTలో కడుపుబ్బా నవ్వించే మూవీ!

వారం వారం ఓటీలలో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటున్నాయి. ఈ సినిమాలు మిస్ చేయకుండా చూడండి.. ఈ వారం చూడాల్సిన సినిమాలు ఇవే అంటూ.. ప్రతి వారం కొన్ని మూవీ సజ్జెషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇక వాటిని మాత్రమే చూసే ప్రేక్షకులు..కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. కొంతకాలం అందరూ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని మాత్రమే బాగా చూశారు. ఇక ఇప్పుడు మళ్ళీ అందరు ఆ సినిమాలతో పాటు కామెడీ సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ మూవీ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొట్ట మొదటి సారిగా ఓ తమిళ చిత్రాన్ని కూడా నిర్మించింది. ఆ చిత్రమే “వడక్కుపట్టి రామ సామి”. ఈ సినిమాలో సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించారు. థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా కూడా ఓటీటీ లో మాత్రం మంచి టాక్ నే సంపాదించుకుంది. ఈ సినిమాకు కార్తీక్ యోగి దర్శకత్వం వహించారు. ఈ తమిళ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. పైగా ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సో ఎంచక్కా ఈ మూవీని ఎంజాయ్ చేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1960, 70 కాలంలో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. ఒక ఊరిలో ఉన్న గుడి, ఆ గుడిలో ఉన్న దేవుడి పేరు చెప్పుకుని.. రామసామీ అనే వ్యక్తి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇక అతనిపై ఉన్న కోపంతో అతని శత్రువులు కొంతమంది ఆ ఊరి గుడిని మూసేస్తారు. ఈ క్రమంలో రామసామి ఓ డాక్టరుతో ప్రేమలో పడతాడు.. మరి ఆ అమ్మాయి మనసును ఎలా గెలిపించుకున్నాడు ! ఇక ఆ గుడిని తెరవడానికి రామసామి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు! అసలు రామ సామి చేసే మోసాలు బయటపడతాయ లేదా! అన్నదే ఈ సినిమా కథ. రొటీన్ స్టోరీగా ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా.. సంతానం కామెడీ బాగుందనే టాక్ కూడా వచ్చింది. కాబట్టి సరదాగా కొద్దిసేపు నవ్వుకోవాలంటే ఎంచక్కా ఈ మూవీని చూసేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş