OTT Must Watch Malayalam Movie : ఈ కాలం కుర్రాళ్లు ఎదుర్కొంటున్న సమస్యపై మూవీ.. OTTలో పడి పడి నవ్వుతారు!

OTT Suggestion : ఈ కాలం కుర్రాళ్లు ఎదుర్కొంటున్న సమస్యపై మూవీ.. OTTలో పడి పడి నవ్వుతారు!

OTT Must Watch Malayalam Movie : ఒకటి రెండు కాదు ఓటీటీ లో లెక్కపెట్టలేనన్ని సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. కాబట్టి వాటిలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను మిస్ చేయడం సహజమే.. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Must Watch Malayalam Movie : ఒకటి రెండు కాదు ఓటీటీ లో లెక్కపెట్టలేనన్ని సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. కాబట్టి వాటిలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను మిస్ చేయడం సహజమే.. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసారో లేదో ఓ లుక్ వేసేయండి.

వారం వారం ఓటీటీ లో వచ్చే సినిమాలే కాకుండా.. ఇంకా ఓటీటీ ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అటు వంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్ . ఒకటి రెండు కాదు ఓటీటీ లో లెక్కపెట్టలేనన్ని సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. కాబట్టి వాటిలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను మిస్ చేయడం సహజమే . అలా ఇప్పటివరకు చాలానే సినిమాను మిస్ చేసి ఉంటారు. ఇక ఎప్పుడైనా దాని గురించి సోషల్ మీడియాలో కనిపించినప్పుడు ఆ మూవీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. ఈ సినిమా స్టార్టింగ్ లో పుల్లినాడ్ గ్రామంలోని దామోదరన్ అనే వ్యక్తి ఇంటిని చూపిస్తారు. అతని భార్య పురిటి నొప్పులతో భాధపడుతూ ఉంటుంది. ఎంతో కష్టం మీద ఒక మగబిడ్డకైతే జన్మనిస్తుంది కానీ.. ఆ బిడ్డలో మాత్రం చలనం ఉండదు, అందరు ఆ బాబు చనిపోయాడని అనుకుంటారు. కానీ ఇంతలో ఒక అతను సిగరెట్ కాల్చుతూ.. సడెన్ గా సిగరెట్ పొగను ఆ బాబు మీదకు వదులుతాడు. దీనితో ఆ బాబులో చలనం వస్తుంది. అతనే ఈ సినిమా హీరో.. పుట్టగానే సిగరెట్ పొగతోనే చలనం వచ్చిన అతనికి.. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఎవరికీ తెలియకుండా సిగరెట్లు త్రాగడం నేర్చుకుంటాడు. తన మామయ్య కూడా ఇతనితో సిగరెట్లు తెప్పించుకుంటూ ఉండేవాడు. దానికి అతనికి కొంత డబ్బు కూడా ఇస్తూ ఉండేవాడు.. హీరో వాటిని తన అవసరాలకు వాడుకుంటూ ఉండేవాడు.

ఇక అప్పటినుంచి టీనేజ్ వచ్చే వరకు కూడా హీరో ఎవరికీ తెలీకుండా సిగరెట్లు కాలుస్తునే ఉండేవాడు. కానీ అనుకోకుండా ఓ రోజు ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పటినుంచి ఇతనిని తీవండి అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ విషయం అందరికి తెలిసిపోడంతో.. అందరికి తెలిసేలా సిగరెట్లు త్రాగుతూ ఉంటాడు. ఈ క్రమంలో హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే పెళ్లి కూతురు అన్న మాత్రం.. సిగరెట్లు మానేస్తేనే పెళ్లికి ఒప్పుకుంటాను అంటాడు. దానికి అతను ఒప్పుకుంటాడు. కానీ దొంగతనంగా సిగరెట్లు తాగుతూనే ఉంటాడు. అనుకోకుండా అతని పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది. అసలు అతనితో సిగరెట్లు మాన్పిస్తారా లేదా ! ఆ తర్వాత ఏమైంది ! ఈ కథలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ! చివరికి ఈ కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే.. “తీవండి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments