OTT Suggestions: OTT లో భయంకరమైన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Best Psychological Thriller: సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్స్ సినిమాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. చాలా మందికి ఈ సినిమా గురించి తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Best Psychological Thriller: సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్స్ సినిమాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. చాలా మందికి ఈ సినిమా గురించి తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హర్రర్ సినిమాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయన్న మాట వాస్తవమే.. మరి ఈ హర్రర్ సినిమాలకు కాస్త సైకలాజికల్ థ్రిల్లర్ సీన్స్ ను కూడా యాడ్ చేస్తే.. ఇంకా అలాంటి సినిమాలు చూడడానికి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. ఇలాంటి సినిమాను ఇప్పటివరకు ఎవరు చూసి ఉండకపోవచ్చు. దాదాపు ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా మూవీ లవర్స్ చూస్తూనే ఉంటారు. కానీ, కొన్ని సార్లు ఎందుకో మిస్ అయిపోతూ ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో .. ఈ సినిమాను మీరు చూశారో లేదో.. చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే .. లియా, గెవిస్ , లూయిస్ అనే ముగ్గరు మెడికల్ స్టూడెంట్స్ . వీరి ముగ్గురు కలిసి ఎల్జేమార్ అనే వ్యాధి ఉన్న పేషంట్స్ గురించి తెలుసుకుని.. వారి గురించి ఓ డాక్యుమెంటరీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో డెబోరా లోగాన్ అనే ఓ మహిళకు ఈ వ్యాధి ఉందని తెలుసుకుని.. ఆమెను కలవడానికి వెళ్తారు. కానీ డెబోరా ఆ ఇంటర్వ్యూకి ఒప్పుకోదు.. కానీ ఆమె కూతురు డబ్బు కోసం ఆమెను ఒప్పిస్తుంది. దీనితో ఆ ముగ్గురు కలిసి డెబోరాను దగ్గరగా పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడు వారికి ఆమె గురించి చాలా వింత వింత విషయాలు తెలుస్తాయి. అప్పటినుంచి డెబోరా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో.. ఆ ముగ్గురు స్టూడెంట్స్ చాలా కంగారు పడతారు. అయితే ఇక్కడ వారికి అసలు నిజం తెలుస్తుంది. ఆమెకు అసలు ఆ వ్యాధి లేదని.. ఆమెను ఇంకేదో శక్తి ఆవహించి ఉందని తెలుసుకుంటారు.

దీనితో ఆ ముగ్గురు డాక్టర్స్ కూడా అక్కడ నుంచి వెళ్లకూడదని.. ఈ కేసు గురించి ఎలా అయినా తెలుసుకోవాలని అనుకుని.. అక్కడే ఉండిపోతారు. అయితే వాళ్ళు అక్కడే ఉన్న సమయంలో వారికి చాలా పాములు కనిపిస్తూ ఉంటాయి. అసలు డెబోరాకు ఏమైంది! ఆమె కూతురు కూడా ఆమెకు ఎల్జేమార్ వ్యాధి ఉందనే అనుకుంటుందా ! అసలు డెబోరా ను ఆవహించిన శక్తి ఎవరిదీ ! ఆ ఇంట్లోకి తరచూ పాములు ఎందుకు వస్తాయి ! ఆ ముగ్గురు స్టూడెంట్స్ దీని గురించి తెలుసుకోవాలి అనుకునే సమయంలో.. వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే “ది టేకింగ్ ఆఫ్ డెబోరా లోగాన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.primevideo.com/detail/The-Taking-of-Deborah-Logan/0IYTM0IFRVSW9USO60RXWC4MPG

Show comments