మగాళ్లను వేటాడే యువతి కథ.. OTT లో బెస్ట్ ‘రివెంజ్’ డ్రామా

రివెంజ్ కథలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఒకరిపై రివెంజ్ తీర్చుకోడానికి ప్లాన్ చేస్తే.. చివరికి ఆ ప్లాన్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది. ఇలాంటి రివెంజ్ స్టోరీని మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

రివెంజ్ కథలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఒకరిపై రివెంజ్ తీర్చుకోడానికి ప్లాన్ చేస్తే.. చివరికి ఆ ప్లాన్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది. ఇలాంటి రివెంజ్ స్టోరీని మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో చాలానే సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మంచి రివెంజ్ డ్రామా కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఇప్పడు చెప్పుకోబోయే మూవీ.. బెస్ట్ అని చెప్పి తీరాలి. పగ , ప్రతీకారం తీర్చుకునే కథలంటే అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే రివెంజ్ కథలు వచ్చి ఉంటాయి కానీ.. ఇలాంటి కథను మాత్రం చూసి ఉండరు. బెస్ట్ రివెంజ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే దానిలో ఈ సినిమా ఫస్ట్ ఉంటుందని చెప్పి తీరాల్సిందే. పైగా ఇది ఒక అమ్మాయి ముగ్గురి అబ్బాయిల మీద తీర్చుకున్న రివెంజ్. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ సినిమాను ఏంటో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ సారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రివెంజ్ స్టోరీస్ లో ఈ సినిమా రూటే సెపరేటు.. ఓపెనింగ్ సీన్ లో ఓ ఎడారిలో నడుచుకుంటూ వస్తున్న రిచర్డ్ అనే వ్యక్తి.. తన గర్ల్ ఫ్రెండ్ జెన్నిఫర్ తో టైమ్ స్పెండ్ చేయడం కోసం.. అక్కడకు వస్తాడు. ఆల్రెడీ రిచర్డ్ కు పెళ్లి అయిపోయి ఉంటుంది. ఆ విషయం జెన్నిఫర్ కు కూడా తెలుసు. అయితే వారిద్దరూ గెస్ట్ హౌస్ కు వెళ్లే సమయంలో.. అతని పైలెట్ అతనికి ఓ డ్రగ్ ఇస్తాడు. అలా వారిద్దరూ ఆ రాత్రి ఆ గెస్ట్ హౌస్ లో ఉంటారు. ఇక నెక్స్ట్ డే అక్కడికి రిచర్డ్ ఫ్రెండ్స్ వస్తారు. వారిని జెన్నిఫర్ కు పరిచయం చేస్తాడు. ఇక రిచర్డ్ తన దగ్గర ఉన్న డ్రగ్ గురించి.. వచ్చిన తన ఇద్దరి ఫ్రెండ్స్ కు ఎదో చెప్పి దానిని జాగ్రత్తగా ఉంచమని జెన్నిఫర్ కు ఇస్తాడు. ఆమె దానిని తన మెడలో ఉండే లాకెట్ లో పెడుతుంది.

ఇక ఆ తర్వాత రోజు రిచర్డ్ ఇంట్లో లేనప్పుడు అతని ఫ్రెండ్ ఒకడు జెన్నిఫర్ ను తప్పుగా చూస్తాడు. అతని పద్ధతి జెన్నీ ఫర్ కు నచ్చదు. కనీసం ఇంకొక అతనైన హెల్ప్ చేస్తాడు అనుకుంటే.. అతను కూడా అలానే ఉంటాడు. ఈ క్రమంలో అతను జెన్నిఫర్ పై అత్యాచారం చేస్తాడు. ఈ విషయం రిచర్డ్ రాగానే చెప్పిన సరే..అతను ఏమి పట్టించుకోడు. దీనితో జెన్నిఫర్ అక్కడినుంచి పారిపోతుంది. హెలికాఫ్టర్ ను పిలిపించి అక్కడినుంచి వెళ్లిపోవాలని చూస్తుంది ఆమె. అయితే వారి విషయం ఎక్కడ బయటపడుతుందా అని.. ఈలోపే ఆమెను ఆ కొండపై నుంచి తోసేస్తారు. ఆమె చనిపోయింది అనుకుని వారంతా ఆ బాడీని డిస్ట్రాయ్ చేయాలనీ అనుకుంటారు. కానీ ఆమె చనిపోదు బ్రతికే ఉంటుంది. దీనితో ఆమెను ఎలాగైనా చంపేయాలని వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? జెన్నిఫర్ ను వారు కనిపెట్టారా? లేదా జెన్నిఫర్ వారిపై రివెంజ్ తీర్చుకుందా ? వారి ముగ్గురు ఇదివరకే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారా ? జెన్నిఫర్ లాకెట్ లో ఉండే డ్రగ్ వలన ఆమెకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “రివెంజ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. సెక్రెటరీతో భర్త అక్ర*మ సంబంధం.. OTTలో ఈ భార్య రివేంజ్ కి వణికిపోతారు!

Show comments