iDreamPost
android-app
ios-app

ప్రేమించిన అమ్మాయి వీడియో లీక్ అయితే? OTTలో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్!

  • Published Jul 31, 2024 | 5:00 AM Updated Updated Jul 31, 2024 | 5:00 AM

OTT Love Suspense Thriller: తమిళ్ లో ఇప్పటివరకు చాలానే ప్రేమ కథలు చాలానే వచ్చాయి.. వాటిలో రా అండ్ రస్టిక్ గా ఉండే ప్రేమ కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ప్రేమ కథ గురించే. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Love Suspense Thriller: తమిళ్ లో ఇప్పటివరకు చాలానే ప్రేమ కథలు చాలానే వచ్చాయి.. వాటిలో రా అండ్ రస్టిక్ గా ఉండే ప్రేమ కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ప్రేమ కథ గురించే. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 31, 2024 | 5:00 AMUpdated Jul 31, 2024 | 5:00 AM
ప్రేమించిన అమ్మాయి వీడియో లీక్ అయితే? OTTలో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్!

ప్రేమ కథా చిత్రాలు అన్నిటికి హ్యాపీ ఎండింగ్స్ ఏ ఉండవు.. వాటిలో కూడా కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి.తమిళ్ లో ఇప్పటివరకు చాలానే ప్రేమ కథలు చాలానే వచ్చాయి.. వాటిలో రా అండ్ రస్టిక్ గా ఉండే ప్రేమ కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి కథలను అర్ధం చేసుకోవాలంటే కాస్త ఓపికగా చూడాల్సిందే. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఒక లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించే. మరి ఈ సినిమా ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారా లేదా ? అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక వ్యక్తి రాజు అనే అతని ఆధార్ కార్డు తీసుకుని అతని కోసం వెతుకుతూ ఉంటాడు. రాజుని ఆ వ్యక్తి బందించి ఎక్కడికో తీసుకుని వెళ్లి చిత్ర హింసలు పెడతాడు. అసలు నీకు ఆ వీడియో సెండ్ చేసింది ఎవరు అని అడుగుతాడు. కట్ చేస్తే ఇక్కడ స్టోరీని గతానికి తీసుకుని వెళ్తారు. అక్కడ ప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని.. కొన ఊపిరితో ఉంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ ప్రియను చూడడానికి వచ్చిన రవి అనే వ్యక్తికీ.. ప్రియ ఫాదర్ రవి,ప్రియ ఇంటిమేట్ అయినప్పుడు తీసుకున్న ఓ వీడియోను చూపిస్తాడు. దీనితో ప్రియ ఫాదర్ రవిని చంపేద్దాం అనుకుంటాడు. దీనితో రవి అక్కడి నుంచి పారిపోతాడు.మరో వైపు రాజును బంధించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రాజును , అతని ఫ్రెండ్ కమల్ ను ఇద్దరినీ చంపేస్తాడు.

అలా కథను గతాన్ని , ప్రస్తుతాన్ని ఇలా స్విచ్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ రవికి, ప్రియకు ఎలా పరిచయం అయింది అనేది చూపిస్తారు. రవి అనే వ్యక్తి.. ఓ మెడికల్ షాప్ లో పని చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో గవర్మెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న.. ప్రియతో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అతని ప్రేమను ప్రియకు చెబుదాం అనుకునే సమయానికి.. ప్రియ మూగమ్మాయి అని తెలుస్తుంది, అయినా సరే రవి,ప్రియను ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ విషయం ప్రియ తండ్రికి తెలిసి ఆమెకు వేరే పెళ్ళి చేద్దామని.. ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి రవి, ప్రియ కలవాలని అనుకుంటారు. సరిగ్గా అప్పుడే ఆమెపై కొంతమంది అత్యాచారం చేస్తారు. ఆమెను అలా చేసింది ఎవరు ? ఈ సంఘటన తర్వాత ఏం జరిగింది ? రవి , ప్రియ ఇంటిమేట్ అయినా వీడియో ఎలా బయటకు వచ్చింది ? కొంతమందిని కిడ్నప్ చేసి చంపుతున్న ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే “ప్రేమలో” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş