బడా డైరెక్టర్లు తీసిన బెస్ట్ మూవీ.. OTTలో ఉంటే ఎందుకు చూడలేదు?

OTT Telugu Best Anthology Movie: ఏదైనా సినిమాకు ఒక్కరే డైరెక్టర్ ఉంటారు. కానీ కొన్ని ఆంథోలజి చిత్రాలకు మాత్రం ఆ సినిమాలో ఉండే కథలను బట్టి దర్శకులు ఉంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఆంథోలజి స్టోరీలోని దర్శకులలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Telugu Best Anthology Movie: ఏదైనా సినిమాకు ఒక్కరే డైరెక్టర్ ఉంటారు. కానీ కొన్ని ఆంథోలజి చిత్రాలకు మాత్రం ఆ సినిమాలో ఉండే కథలను బట్టి దర్శకులు ఉంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఆంథోలజి స్టోరీలోని దర్శకులలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఒకటే కథను సినిమా మొత్తం చూపించడం ఒక ఎత్తైతే.. ఒకే సినిమాలో నాలుగైదు కథలను ఎటువంటి కన్ఫ్యూజన్ రానివ్వకుండా.. ఇంట్రెస్టింగ్ గా చూపించడం మరొక ఎత్తు. ఇలాంటి వాటినే ఆంథోలజి కథలని అంటూ ఉంటారు. ఇక ఇలాంటి ప్లాట్స్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా కూడా చూసే వారికి మంచి రెఫ్రెషింగ్ ఫీలింగ్ ను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.. ఇక ఇలాంటి సినిమాలకు .. ఆయా సినిమాలలో ఉండే కథలను బట్టి ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు ఉంటూ ఉంటారు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో ఓ కథకు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయడం విశేషం. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు “పిట్ట కథలు”.. ఈ సినిమాలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. సో ఒక్కో కథకు ఒక్కో డైరెక్టర్ ఉన్నారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి కలిసి డైరెక్ట్ చేశారు. కాగా పిట్ట కథలు మూవీలో శృతి హాసన్, ఈషా రెబ్బా, అమలా పాల్, లక్ష్మి మంచు, జగపతి బాబు, అషిమా నార్వాల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. వెబ్ సిరీస్ లు ఎలాంటి ఫీల్ ను అయితే ఇస్తాయో.. ఇలాంటి ఆంథోలజి మూవీస్ కూడా అంతే సస్పెన్స్ తో ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి. మరి ఈ మూవీలో కథలేంటి.. అనే విషయానికొస్తే..

ఈ మూవీలో మొదటి కథ రాముల గురించి ఉంటుంది. ఆమె తెలంగాణలోని ఓ చిన్న టౌన్ కు చెందిన అమ్మాయి. ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వీరిద్దరూ మధ్య అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. వీరిద్దరి విషయం తెలిసిన అదే ఊరికి చెందిన ఓ లేడి పొలిటీషియన్ వారిని ఎలా వాడుకుంది.. అనేదే ఈ మూవీ కథ. ఇక రెండో కథ మీరా అనే ఓ గృహిణికి సంబంధించింది. తన కంటే 18 ఏళ్ళ పెద్దవాడైన తన భర్త వలన మీరా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది.. మరి వీరిద్దరి కథ ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా కథ. ఇక మూడవ కథ ఎక్స్ లైఫ్.. సంజిత్ హెగ్దే అనే ఓ యంగ్ సైంటిస్ట్ ఎక్స్ లైఫ్ అనే ఓ భవిష్యత్ టెక్నలాజిని కనిపెడతాడు. మరి దీని వలన ఏం జరిగింది అనేదే ఈ కథ. ఇక నాల్గవ కథ విషయానికొస్తే.. ఈ కథ పేరు పింకీ.. ఈ కథ అంతా కూడా పెళ్ళి అయినా ఓ రైటర్ కు సంబంధించి ఉంటుంది. ఈ కథలో హీరోకు ఆల్రెడీ మరో అమ్మాయితో పెళ్ళైన కూడా.. అతని మాజీ భార్యతో అఫైర్ కొనసాగిస్తూ ఉంటాడు. వీరి కథ ఎలా ముగిసిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Show comments