iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: OTT Movie: లాయరే క్రిమినల్ అయితే.. సక్సెస్ కావడం కోసం ప్రాణాలు తీస్తూ!

  • Published Jun 08, 2024 | 5:59 PM Updated Updated Jun 08, 2024 | 5:59 PM

ఓటీటీ లో బెస్ట్ మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే.. ఈ మూవీ సజ్జెషన్ మీ కోసమే. చాలా సినిమాలు ఓటీటీ లో ఉండడంతో కొన్ని సినిమాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరు మిస్ చేసిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో బెస్ట్ మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే.. ఈ మూవీ సజ్జెషన్ మీ కోసమే. చాలా సినిమాలు ఓటీటీ లో ఉండడంతో కొన్ని సినిమాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరు మిస్ చేసిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 08, 2024 | 5:59 PMUpdated Jun 08, 2024 | 5:59 PM
OTT Movie Suggestion: OTT Movie: లాయరే క్రిమినల్ అయితే.. సక్సెస్ కావడం కోసం ప్రాణాలు తీస్తూ!

ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి చాలానే సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు వచ్చాయని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఆయా సినిమాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఓటీటీ లోకి రావడంతో.. ఇప్పుడు ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. దీనితో ఇంకా ఏమైనా బెస్ట్ మూవీస్ ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు ప్రేక్షకులు. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి మీరు మిస్ చేసిన మూవీస్ లో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి. ఒకవేళ మిస్ అయితే కనుక వెంటనే ఈ సినిమాను చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు చాలా వరకు మలయాళ సినిమాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా కూడ అలాంటిదే. ఈ సినిమా కథేంటంటే.. ముకుంద‌న్ ఉన్ని అనే వ్యక్తి LLB పూర్తిచేస్తాడు. 36 ఏళ్ళు వచ్చినా కూడా లా ప్రొఫెషన్ లో సక్సెస్ కాలేకపోతాడు. అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తే.. సెటిల్ కాలేమని భావించి.. తానే సొంతంగా కేసులు వాదించాలని డిసైడ్ అవుతాడు. కానీ అక్కడ కూడా అతనికి సక్సెస్ రాదు. మరో వైపు వేణు అనే మరో లాయర్.. తప్పు దారిలో వెళ్లి డబ్బు సంపాదిస్తుంటాడు. ముకుందన్ కూడా తన దారిలోనే వెళ్లి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు.

వేణు ఓ హాస్పిటల్ కు వచ్చే యాక్సిడెంట్ కేసులను క్లెయిమ్ చేస్తుండడంతో.. ముకుందన్ కూడా అదే హాస్పిటల్ ను ఎంచుకుంటాడు. ఈ క్రమంలో వేణు తనకు అడ్డుగా ఉన్నాడని తనని ప్లాన్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది! లాయర్ గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్న వేణుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి! అతను లాయర్ గా సక్సెస్ అయ్యాడా లేదా ! వేణును ముకుందన్ చంపిన విషయం ఎవరికైనా తెలుస్తుందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే “ముకుందన్ ఉన్ని అసోసియేట్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైన మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet