Best Romantic Comedy Movie In OTT: మూడు ముక్కల్లో చెప్పాలంటే.. OTT లో బెస్ట్ రొ*మాంటిక్ కామెడీ మూవీ

మూడు ముక్కల్లో చెప్పాలంటే.. OTT లో బెస్ట్ రొ*మాంటిక్ కామెడీ మూవీ

OTT Best Romatic Comedy Movie: కొన్ని సినిమా పేర్లు వింటే.. అరే ఇలాంటి ఓ సినిమా కూడా వచ్చిందా అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి విన్నా కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Romatic Comedy Movie: కొన్ని సినిమా పేర్లు వింటే.. అరే ఇలాంటి ఓ సినిమా కూడా వచ్చిందా అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి విన్నా కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

కొన్ని సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు. ఎవరైనా ఎప్పుడైనా ఆ సినిమాల గురించి ప్రస్తావించినప్పుడు.. ఇలాంటి ఓ సినిమా కూడా ఉందా అసలు ఎప్పుడు వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సినిమాల గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా కూడా.. ఇలాంటి సినిమాల గురించి ఒక్కసారి తెలుసుకున్న తర్వాత.. అరే ఇలాంటి సినిమానా మిస్ చేసింది. అని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. దాదాపు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కాబట్టి ఈ సినిమా ఏంటో తెలుసుకుని వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాకు ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కుమారుడు.. ఎస్పీ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం , లక్ష్మి ప్రధాన పాత్రలలో నటించగా… వారితో పాటు బ్రహ్మానందం , తనికెళ్ళ భరణి, అలీ , రాజా రవీంద్ర , కాదంబరి కిరణ్ , వెంకీ లాంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే “మూడు ముక్కలాట” . ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ . పైగా ఈ సినిమా షూటింగ్ ను కూడా కేవలం 70 రోజులలోనే పూర్తి చేశారట మేకర్స్. చాలా మందికి ఇలాంటి ఓ సినిమా వచ్చిందని కూడా తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక మూడుముక్కలాట సినిమా కథ విషయానికొస్తే.. చాలా సింపుల్ స్టోరీ లైన్.. ఇద్దరు యువకులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనీ అనుకుంటూ ఉంటారు. వారు ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టారు ! వారి జీవితాల్లో వచ్చిన మార్పులేంటి ! వారు సరైన నిర్ణయమే తీసుకున్నారా ! అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. మరి ఇందులో ఉన్న ప్రేమ కథ ఏంటి.. ఇక ఈ సినిమాలో బాలసుబ్రమణ్యం పాత్ర ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మిథునం సినిమాతో.. సినిమా మొత్తం కేవలం ఇద్దరు మాత్రమే నటించి.. ఎంతో మందిని తమతో పాటు ప్రేమలో పడేలా చేశారు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం , లక్ష్మి . మరి ఈ సినిమాల్లో ఈ జంట ఎలాంటి పాత్రలో నటించారో తెలియాలన్నా కూడా ఈ సినిమాను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments