ఆ ఫ్రెండ్స్ అంతా చేసిన పెద్ద “మిస్టేక్” అదే! OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Best Telugu Suspense Thriller: హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నారు. కానీ తెలుగులో కూడా అలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Telugu Suspense Thriller: హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నారు. కానీ తెలుగులో కూడా అలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు థియేటర్ లో అయినా ఓటీటీ లో అయినా థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక గత కొంతకాలంగా ప్రేక్షకులు ఓటీటీ లకు బాగా అలవాటు పడడంతో.. మూవీ లవర్స్ ను మెప్పించడానికి ఎదో ఒక కొత్త పాయింట్ ను టచ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాల రేంజ్ లో.. డైరెక్ట్ తెలుగులో కూడా మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నారు మేకర్స్. కాసేపు హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలను పక్కన పెట్టేస్తే.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించే ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి , ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ తెలుగు సినిమా గురించే.. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. హెయిర్ స్టైలిష్ అగస్త్య , పూజారి దేవదాస్ , కార్తీక్ ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్ లో ఉంటూ ఉంటారు. దీనితో వీరి ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఈ ముగ్గురు కూడా ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో ఉంటారు. అగస్త్య డీసీపీ కూతురితో… దేవదాస్ మరో అమ్మాయితో.. కార్తీక్ ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయితో లవ్ లో ఉంటారు. వారి లైఫ్స్ హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా గడిచిపోతూ ఉంటాయి. అలా హ్యాపిగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ రోజు వారంతా వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకుని.. వారం రోజుల పాటు సిటీకి దూరంగా ఎక్కడో ఓ అడవికి వెళ్తారు. అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వారు అడవికి వెళ్లే సమయంలో దారి మధ్యలో.. కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఆ సమస్యలు ఏంటి ! ఆ సమస్యలను వారంతా ఎలా ఎదుర్కొన్నారు ! వాటిని దాటి అడవికి వెళ్ళారా లేదా ! తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “మిస్టేక్”. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా.. చాలా వరకు సినిమాలు కథను బట్టి సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇక అలాంటి సినిమాలను కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. దాదాపు థియేటర్ లో హిట్ కానీ చిత్రాలు కూడా ఓటీటీ లో మాత్రం హిట్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ఓ మంచి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments