OTT Suggestion - Best Refreshing Movie : ముగ్గురు లైఫ్స్ ను మార్చేసిన ఓ ప్రయాణం.. OTT లో తప్పక చూడాల్సిన మూవీ

OTT Suggestion: ముగ్గురు లైఫ్స్ ను మార్చేసిన ఓ ప్రయాణం.. OTT లో తప్పక చూడాల్సిన మూవీ

OTT Best Refreshing Movie : ఓటీటీ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఉంటాయి. కానీ జీవితంలో ఎప్పటికైనా కనీసం ఓసారైనా చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Refreshing Movie : ఓటీటీ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఉంటాయి. కానీ జీవితంలో ఎప్పటికైనా కనీసం ఓసారైనా చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

జీవితంలో చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి. కానీ కుటుంబ పరిస్థితులు కారణంగా వారి ఇష్టాల విషయంలో రాజి పడాల్సి ఉంటుంది. మరి చివరికి వారి జీవితంలో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారా లేదా అనేదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ. ఓటీటీ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఉంటాయి. కానీ జీవితంలో ఎప్పటికైనా కనీసం ఓసారైనా చూడాల్సిన సినిమాలు మాత్రం కొన్ని ఉంటాయి . అలాంటి లిస్ట్ లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఉంటుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ కథ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో అవినాష్ అనే వ్యక్తికీ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం.. దానినే కెరీర్ గా ఎంచుకోవాలని అనుకుంటాడు. కానీ తన తండ్రి మాత్రం దానికి ఒప్పుకోడు. దీనితో వారిద్దరి మధ్యన దూరం పెరుగుతుంది. తండ్రి మాట కాదనలేక, తనకు నచ్చింది చేయలేక.. అడ్జస్ట్ అవుతూ గడిపేస్తున్న తన జీవితంలో.. చిన్న ఊరట ఏంటంటే తాను ఉండే అపార్ట్మెంట్ లోని ఓ అమ్మాయి. ఈ క్రమంలో ఓ రోజు అవినాష్ తండ్రి చనిపోయాడని కాల్ వస్తుంది. దీనితో తన ఫ్రెండ్ షోకార్ ను తీసుకుని.. తన తండ్రి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోడానికి వెళ్తాడు. వెళ్లి ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని.. దానిని దహనం చేయడానికి వెళ్ళినప్పుడు.. ఆ బాడీ మారిపోయిందని తెలుస్తుంది. అక్కడ తన తండ్రి బాడీకి బదులు.. ఓ మహిళా బాడీ ఉంటుంది.

దీనితో అవినాష్ ఆ డెడ్ బాడీని ఎక్స్చేంజ్ చేసుకోడానికి బెంగుళూరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చనిపోయిన ఆ మహిళా మనఉమారాలైన సానియాను కలవాల్సి వస్తుంది. దీనితో ఈ ముగ్గురు కలిసి ఆ డెడ్ బాడీతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో వారికి ఎదురైన సంఘటనలు ఏంటి ! అసలు ఈ కథ ఏంటి ! ఈ ప్రయాణం వలన ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ! అవినాష్ తనకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడా లేదా ! అవినాష్, సానియా మధ్య ఎలాంటి బాండ్ ఏర్పడుతుంది ! ఆ తర్వాత ఏం జరుగుతుంది ! ఇవన్నీ తెలియాలంటే “కార్వాన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూడండి.. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments