క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లో దీన్ని మించింది లేదు.. ఏ OTTలో ఉందంటే!

OTT Best Crime Investigation Thriller: కొన్ని సినిమాలలో కేవలం తమ అభిమాన నటి నటులు ఉన్న కారణంగా వాటిని చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరో ఈ సినిమా మీరు చూసిన సినిమాల లిస్ట్ లో ఉందో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Crime Investigation Thriller: కొన్ని సినిమాలలో కేవలం తమ అభిమాన నటి నటులు ఉన్న కారణంగా వాటిని చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరో ఈ సినిమా మీరు చూసిన సినిమాల లిస్ట్ లో ఉందో లేదో ఓ లుక్ వేసేయండి.

డైరెక్ట్ గా తీసే సినిమాలకంటే కూడా.. దాదాపు తమిళ, మలయాళ , కన్నడ చిత్రాల రీమక్స్ , డబ్బింగ్ చిత్రాలే ఎక్కువ హిట్ అవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాలను చూడడానికి ప్రేక్షకులు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఆ సినిమాలలో తెలిసిన నటీ నటులు లేకుండానే కొన్ని సినిమాలను ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉంటారు. అలాంటిది.. ఆ సినిమాలో తమ అభిమాన నటి నటులు ఉన్నారంటే .. ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో.. ఈ సినిమాలో నటించిన హీరో ఎవరో.. ఈ సినిమా ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమాలో హీరో ఓ ట్రాఫిక్ పోలీస్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే అతనికి క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనేది కల. కానీ దానికి అతని పై అధికారి ఒప్పుకోడు. దీనితో తనకి ఇష్టం లేకపోయినా సరే ట్రాఫిక్ పోలీస్ గానే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతను విధులు నిర్వహిస్తున్న పరిధిలో.. ఓ కుటుంబానికి చెందిన ఆస్థి పంజరాలు బయట పడతాయి. ఇన్వెస్టిగేషన్ లో అవి సుమారు 40 ఏళ్ళ క్రిందట జరిగిన హత్యలను తేలుతుంది. దీనితో క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఆ కేసును మూసివేయాలనే ఆలోచనలో ఉండగా.. హీరో ఆ కేసును టేక్ అప్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ! ఇంతకీ 40 ఏళ్ళ క్రితం ఆ హత్యలు చేసింది ఎవరు! హీరో వారిని పెట్టుకున్నాడా లేదా ! క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనే అతని కోరిక నెరవేరిందా లేదా! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా మరేదో కాదు.. హీరో సుమంత్ నటించిన కపటదారి మూవీ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చినా కానీ.. ఈ సినిమా మాత్రం కాస్త డిఫ్ఫరెంట్. ప్రతి సినిమాకు ఇలానే చెప్తుంటారు అనుకుంటే పొరపాటే.. ఇది నిజంగానే కాస్త డిఫ్ఫరెంట్ కథ. ఓ హత్య జరుగుతుంది. దాని వెనుక ఎవరున్నారు అనేది మాత్రం అర్ధం కాదు. ఎటువంటి క్లూ కూడా ఉండదు. కేవలం చిన్న అనుమానం మాత్రమే ఉంటుంది. దానిని పట్టుకుని కేసును సాల్వ్ చేద్దాం అనుకునే లోపే.. మధ్యలో ఇంకొన్ని అవాంతరాలు. దీనితో కేసు ఇంకా బలపడడం. ఆధారాలు, మనుషులు , పరిస్థితులు అన్నీ మారిపోయినా కూడా.. 40 ఏళ్ళ క్రితం కేసును ఎలా సాల్వ్ చేసారో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Show comments