OTT Best Web Series: OTTలో సూపర్ వెబ్ సిరీస్! దీన్ని స్టార్ట్ చేస్తే ఇక జాబ్, సంసారం ఏమి పట్టించుకోరు!

ఓటీటీ లో ఇప్పటివరకు కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ వెబ్ సిరీస్ మీరు చూసిన లేదా మిస్ చేసిన వాచ్ లిస్ట్ లో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో ఇప్పటివరకు కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ వెబ్ సిరీస్ మీరు చూసిన లేదా మిస్ చేసిన వాచ్ లిస్ట్ లో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.

వెబ్ సిరీస్ లకు ఈ మధ్య ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే వెబ్ సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ కు ఓ ట్విస్ట్ ఉంటుంది. దీనితో ఈ సినిమాలను చూసేందుకు బాగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు.. ఇక వెబ్ సిరీస్ లు అన్నీ కూడా హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలోనే కొనసాగుతాయి. కానీ ప్లాట్స్ అన్నీ ఒకటే అయినా కూడా ప్రతి సిరీస్ లోను, సినిమాలోను చూపించే కథలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉన్న వారికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా దీనికి కాస్త పార్లల్ గానే ఉంటుంది. మరీ ఈ వెబ్ సిరీస్ ను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రతి ఒక్కరికి మోస్ట్ ఫేవరేట్ వెబ్ సిరీస్ ఇది. మొత్తం ఎనిమిది సీజన్స్ తో పాటూ సాగిన ఈ వెబ్ సిరీస్ ప్రపంచంలోనే టాప్ రేటెడ్ వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మాత్రం దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన ఓ వెబ్ సిరీస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వారికి ఈ వెబ్ సిరీస్ ఈజీగా అర్థమైపోతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఖాలిసిగా పేరొందిన.. రాణి డేనెరియస్.. పుట్టడానికి 172 సంవత్సరాల ముందు నాటి కథ ఇది. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న కింగ్ జెహెరియన్ తన సొంత కూతురు రెనీస్ దూరపు బంధువును రాజుగా ఎంచుకుంటారు. ఆ రాజు పేరు వినేరిస్. సింహాసనం మీద కేవలం మగవారు మాత్రమే కూర్చోవాలనే.. ఉద్దేశంతో జెహెరియాన్ ఈ నిర్ణయం తీసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత.. వినేరిస్ భార్య గర్భవతి అవుతుంది. తనకు కొడుకు పుడితే సింహాసనానికి వారసుడు అవుతాడని.. వినేరిస్ ఆశలు పెట్టుకుంటాడు. లేదు అంటే అప్పుడు ఆ సింహాసనం , రాజ్య పాలనా తన తమ్ముడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఈ కథ ఎలా ముందుకు సాగింది తెలియాలంటే.. హౌస్ ఆఫ్ డ్రాగన్స్ అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

హౌస్ ఆఫ్ డ్రాగన్స్ సిరీస్ చూడాలంటే.. ముందు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడాల్సిందే. ఈ టైపు ఆఫ్ వార్ బేస్డ్ చిత్రాలలో ఎవరు ఎప్పుడు విలన్ అవుతారో.. ఎవరు ఎప్పుడు హీరో అవుతారా , ఎవరి కథ ఎప్పుడు ముగిసిపోతుందో చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లను మొదటి నుంచి ఫాలో అయ్యేవారికి.. వీటిని చూసేటప్పుడు వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్తాయి. ఈ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ లను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments