iDreamPost
android-app
ios-app

కూతురు ఉన్న ప్రతి తండ్రి చూడాల్సిన మూవీ.. OTTలో ఇంకా చూడలేదా?

  • Published Jun 20, 2024 | 5:26 PM Updated Updated Jun 20, 2024 | 5:26 PM

OTT Best Refreshing Movie: కాస్త ఈ హర్రర్ , థ్రిల్లెర్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ పక్కన పెట్టేసి.. ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చుడాలనిపిస్తే మాత్రం ఈ సినిమా చూసేయండి. ఈ సినిమా చూసిన తర్వాత అందరికి కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Refreshing Movie: కాస్త ఈ హర్రర్ , థ్రిల్లెర్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ పక్కన పెట్టేసి.. ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చుడాలనిపిస్తే మాత్రం ఈ సినిమా చూసేయండి. ఈ సినిమా చూసిన తర్వాత అందరికి కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 20, 2024 | 5:26 PMUpdated Jun 20, 2024 | 5:26 PM
కూతురు ఉన్న ప్రతి తండ్రి చూడాల్సిన మూవీ.. OTTలో ఇంకా చూడలేదా?

కాలేజ్ డేస్ ను రీకాల్ చేసే సినిమాలు.. ఇప్పటివరకు చాలానే వచ్చాయి. చూసిన ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా ఎదో ఒక పాయింట్ ఎక్కడో ఓ దగ్గర అందరికి వాళ్ళ వాళ్ళ కాలేజీ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాలేజ్ డేస్ అనగానే అందరికి గుర్తొచ్చేది ప్రేమ కథలు.. ఇక సినిమాలలో అయితే ప్రేమ కథలను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ ఉంటారు. నిజంగా మన లైఫ్ లో కూడా ఇలాంటి సీన్ ఏ జరిగింది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాను మిస్ అయితే కనుక.. ఖచ్చితంగా ఓ ఫీల్ గుడ్ మూవీని మిస్ అయినట్లే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పటివరకు ప్రేమ కథలంటే .. అబ్బాయిలని హైలెట్ చేస్తూ.. కేవలం మేల్ పెర్స్పెక్టివ్ లోనే ఉండే సినిమాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ సినిమా అలాంటిది కాదు.. పూర్తిగా ఫీమేల్ పెర్స్పెక్టివ్ లో వచ్చిన ఓ మంచి టీనేజ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఈ సినిమా ఖచ్చితంగా టీనేజ్ అమ్మాయిలందరికి కూడా ఈజీగా నచ్చేస్తుంది. ఒక అమ్మాయి లైఫ్ లో వచ్చే ప్రేమ కథలు, ప్రతి ఫేస్ లోను ఆ అమ్మాయిలో వచ్చే మార్పు.. చివరికి ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్స్ ఇలా అన్ని కూడా మంచి ఫీల్ ని ఇస్తాయి. హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే లవ్,ఏమోషన్ సీన్స్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా పేరు “హలో జూన్”. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

HEllo June

ఈ సినిమా కథ విషయానికొస్తే.. జూన్ అనే 16 సంవత్సరాల అమ్మాయి.. స్కూల్ అయిపోయాక.. ఇంటర్ జాయిన్ అవ్వడానికి ఓ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఆ అబ్బాయికి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ ఇంటర్ లో మొదలైన ప్రేమ అక్కడే ఆగిపోతుంది. ఆ తర్వాత ఆమె డిగ్రీ లో జాయిన్ అవుతుంది. అక్కడ కూడా ఆమెకు రకరకాల అనుభవాలు ఎదురౌతాయి. 16 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు.. ఆమె ప్రయాణంలో ఎదురైనా ప్రేమ కథలు.. గడిచిన 10 సంవత్సరాలలో ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ , రిలేషన్ షిప్ , తన లైఫ్ ఎక్స్పీరియెన్స్ ఆమెను ఎలా మౌల్డ్ చేశాయి. ఆమె తల్లి తండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. చివరకి ఆమె లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేదే ఈ సినిమా కథ. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş