iDreamPost
android-app
ios-app

ప్రేమించిన అమ్మాయి పెళ్లి తర్వాత అక్క అయితే! OTT లో కామెడీ మూవీ

  • Published Jul 10, 2024 | 3:40 PM Updated Updated Jul 10, 2024 | 3:40 PM

OTT Best Comedy Movie: కొన్ని మలయాళ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ మూవీ గురించే ఈ మధ్యనే ఓటీటీ లోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Comedy Movie: కొన్ని మలయాళ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ మూవీ గురించే ఈ మధ్యనే ఓటీటీ లోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 10, 2024 | 3:40 PMUpdated Jul 10, 2024 | 3:40 PM
ప్రేమించిన అమ్మాయి పెళ్లి తర్వాత  అక్క అయితే! OTT లో కామెడీ మూవీ

మలయాళం సినిమాలు ఎన్ని చూసినా కానీ ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు కేవలం ఓటీటీ లలో మాత్రం ఫేమస్ అయినా మలయాళ సినిమాలు.. ఇప్పుడు థియేటర్స్ లో సైతం తమ సత్తా ఏంటో చూపించేస్తున్నాయి. దీనితో ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ప్రత్యేకించి ఈ సినిమాల కోసమే సెర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. దినోతో మేకర్స్ కూడా కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

సరదాగా కడుపుబ్బా నవ్వించే సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ వాటిలో ఒకటి. డైరెక్ట్ గా ఈ మూవీ కథ విషయానికొస్తే.. గురువాయుర్ అనే ఊరికి చెందిన విను రామ చంద్రన్ అనే వ్యక్తి దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి అంజలి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే విను పెళ్లికి ముందు అంజలితో కంటే.. ఆమె అన్న ఆనంద్ తోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. రోజు బావ బావమరిది ఇద్దరు గంటలు గంటలు కాల్స్ మాట్లాడుకుంటూ.. ఒకరికి ఒకరు బాధలను పంచుకుంటూ ఉంటారు. అయితే ఆనంద్ కు ఆల్రెడీ పెళ్లి అయ్యి భార్య బిడ్డ కూడా ఉంటారు కానీ.. కొన్ని మనస్పర్థల కారణంగా వారిద్దరూ దూరంగా ఉంటూ ఉంటారు. ఇది తెలుసుకున్న విను ఎలా అయినా పెళ్లి సమయానికి వీరిద్దరిని కలపాలని అనుకుంటాడు.

ఇంతలో పెళ్లి సమయం దగ్గర పడడంతో.. విను దుబాయ్ నుంచి ఊరికి వస్తాడు. అయితే విను కు గతంలో ఆల్రెడీ ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అనుకోకుండా ఆమెకు పెళ్ళైపోతుంది. ఆ బాధలో నుంచి విను ని బయటకు తీసుకుని రాదని ఆనంద్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆనంద్ ను అతని భార్యను విను కాల్స్ ద్వారానే కలిపేస్తాడు. అంతా బాగానే సాగుతున్న సమయంలో ఊరికి వచ్చిన వినుకు ఓ ఊహించని సంఘటన ఎదురౌతుంది. ఆనంద్ భార్యను చూసిన తర్వాత విను షాక్ అవుతాడు.అప్పటివరకు బావ బావమరిది అంటూ క్లోజ్ గా ఉన్న ఇద్దరు బద్ద శత్రువులులా మారిపోతారు. విను ని మాత్రమే పెళ్లి చేసుకోమని తన చెల్లికి చెప్పిన ఆనంద్.. అసలు ఈ పెళ్లి చేయడానికి కూడా ఇష్టపడడు. ఎలా అయినా ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు. అసలు ఆనంద్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు ? ఆనంద్ భార్య ను చూసి విను ఎందుకు షాక్ అవుతాడు ? ఆనంద్ ఎందుకు పెళ్లి ఆపేయాలను పట్టుబడతాడు ? చివరికి ఈ పెళ్లి జరుగుతుందా లేదా ? ఇవన్నీ తెలియాలంటే “గురువాయిర్ అంబలనడయిల్” అనే ఈ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş