iDreamPost
android-app
ios-app

OTT లో అదిరిపోయే కొరియన్ డ్రామా.. చూస్తే ప్రేమలో పడాల్సిందే !

  • Published Jun 19, 2024 | 4:03 PM Updated Updated Jun 19, 2024 | 4:03 PM

OTT Best Korean Drama: కాసేపు హాలీవుడ్ బాలీవుడ్ లో వచ్చే హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ పక్కన పెట్టేస్తే.. కొరియన్ డ్రామాస్ అందరిని మాయ చేసి ప్రేమలో పడేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఓ మంచి కొరియన్ డ్రామా గురించి చూసి చాల రోజులు అయిపోయింది అనిపిస్తే.. ఈ సిరీస్ చూసేయండి.

OTT Best Korean Drama: కాసేపు హాలీవుడ్ బాలీవుడ్ లో వచ్చే హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ పక్కన పెట్టేస్తే.. కొరియన్ డ్రామాస్ అందరిని మాయ చేసి ప్రేమలో పడేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఓ మంచి కొరియన్ డ్రామా గురించి చూసి చాల రోజులు అయిపోయింది అనిపిస్తే.. ఈ సిరీస్ చూసేయండి.

  • Published Jun 19, 2024 | 4:03 PMUpdated Jun 19, 2024 | 4:03 PM
OTT లో అదిరిపోయే కొరియన్ డ్రామా.. చూస్తే ప్రేమలో పడాల్సిందే !

ఎప్పుడు హర్రర్, సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్స్ ఏం చూస్తారు. కాసేపు వాటి నుంచి బ్రేక్ తీసుకుని ఓ మంచి రొమాంటిక్ డ్రామా చూస్తే.. కాస్త రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది మూవీ లవర్స్ కి. అయితే ఈ జోనర్ లో తెలుగు సినిమాల కంటే కూడా కొరియన్ సినిమాలు బాగా కిక్ ఇస్తూ ఉంటాయి. కొరియన్ సినిమాలంటే దాదాపు అన్ని లవ్ , రొమాంటిక్ కథలే ఉంటూ ఉంటాయి. కానీ కాస్త డిఫ్ఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. కొరియన్ డ్రామాస్ చూస్తూ ప్రేమలో పడని వారు ఎవరు ఉండరు. ఈ మధ్య కాలంలో ఓ మంచి కొరియన్ డ్రామా చూసి చాలా కాలం అయిందని అనిపిస్తే మాత్రం.. ఈ సిరీస్ మీకోసం. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కొరియన్ డ్రామాస్ అంటే ఇప్పుడు కేవలం కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉండడం లేదు. తెలుగులో కూడా వాటిని రీమేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొరియన్ డ్రామాస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు వీటిని తెగ చూసేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ సిరీస్ కథేంటంటే.. ఇది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కి మధ్య జరిగిన ఓ కథను చూపిస్తారు. ఈ సిరీస్ లో హీరో ఓ ఫేమస్ టైక్వాండో ప్లేయర్ . కానీ ఉన్నట్లుండి కొన్ని చేదు అనుభవాల వలన ఆ గేమ్ ను ఆపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను ఎటువంటి టాగ్ లేని ఓ మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. తాను తన కెరీర్ కోసం ఫైట్ చేస్తున్న క్రమంలో.. చిన్నప్పటి నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైనా పరిస్థితులు ఏంటి! వాళ్ళ ప్రేమ కథ ఎలా కొనసాగింది అనేది ఈ సిరీస్ కథ.

ఈ సిరీస్ పేరు “ఫైట్ ఫర్ మై వే”. ఈ సిరీస్ ప్రస్తుతం ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. బెస్ట్ కొరియన్ డ్రామాస్ లిస్ట్ తీస్తే కనుక అందులో టాప్ 10 లో ఈ సిరీస్ కూడా ఉంటుంది. కొరియన్ డ్రామాస్ అన్ని ఒకే ప్లాట్ లో అనిపించినా కూడా ఒక్కో స్టోరీ ఒక్కో విధంగా ఉంటుంది . ఆ సిరీస్ యూ చూస్తున్న కొద్దీ.. ఖచ్చితంగా క్యారెక్టర్స్ తో ప్రేమలో పడిపోతారు ప్రేక్షకులు. ఆ విధంగా డిఫ్ఫరెంట్ వరల్డ్ లోకి తీసుకుని వెళ్లిపోతుంటారు మేకర్స్. ఈ సిరీస్ కూడా అంతే. ఈ సిరీస్ లో మొత్తం 16 ఎపిసోడ్స్ ఉన్నాయ్. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేసారంటే మధ్యలో బ్రేక్ కూడా తీసుకోవాలని అనిపించదు. మరి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం.. వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss