OTT Best Psycho Crime Thriller : టీనేజ్ గర్ల్స్ వరుస హత్యలు.. OTT లో అదిరిపోయే సైకో క్రైమ్ థ్రిల్లర్!

OTT Best Psycho Crime Thriller : టీనేజ్ గర్ల్స్ వరుస హత్యలు.. OTT లో అదిరిపోయే సైకో క్రైమ్ థ్రిల్లర్!

OTT Movie Suggestion: సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ ప్లాట్స్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా .. ఆఖరి వరకు సస్పెన్స్ తో కొనసాగుతుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ ప్లాట్స్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా .. ఆఖరి వరకు సస్పెన్స్ తో కొనసాగుతుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

అదేంటో ఏమో తెలియదు కానీ.. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అందులోను ఆ ఇన్వెస్టిగేషన్ ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం అయితే, ఆ సినిమా కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ ప్లాట్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చినా కానీ.. వచ్చిన ప్రతి సినిమాలోనూ ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటూ.. ప్రేక్షకులను ఈ తరహా సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేసిన వారు ఉంటే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ముందు చెప్పుకున్నట్లుగానే ఈ సినిమా ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం వెనుక కొనసాగుతుంది. ఈ సినిమాలో హీరో ఓ ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగ ఉన్న సైకోలు, ఉన్మాదులు, మతి స్థిమితం సరిగా లేని వ్యక్తులు చేస్తున్న హత్యలపై రీసెర్చ్ చేసి.. ఓ మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రాయాలనేదే అతని డ్రీమ్. అయితే సినిమా అవకాశాలు కోసం చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఏది వర్క్ అవుట్ అయ్యేది కాదు. మరో వైపు కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయడంతో.. అతను ఎస్ఐ గా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అతను జాబ్ లో జాయిన్ అయినా కొన్ని నెలలకే ఓ 16ఏళ్ళ అమ్మాయి దారుణంగా హత్య చేయబడుతుంది. ఇక ఎలాగూ హీరో కు ఇలాంటి వాటి మీద పరిశోధన ఎక్కువే కాబట్టి.. వెంటనే అది సైకో హత్య గా గుర్తిస్తాడు.

మొదట్లో వారి డిపార్ట్మెంట్ ఈ విషయాన్నీ నమ్మకపోయినా కూడా.. మెల్లగా అందరు ఇతని మాటలను నమ్ముతారు. కట్ చేస్తే హీరో మేనకోడలు కూడా అనుకోకుండా ఓ రోజు హత్యకు గురి అవుతుంది. దీనితో అప్పటినుంచి ఆ కేసును మరింత లోతుగా పరిశీలించడం మొదలు పెడతాడు హీరో.. ఈ క్రమంలో అతనికి మరిన్ని అనుమానాస్పద ఘటనలు ఎదురౌతూ ఉంటాయి. ఈ కేసును ఎలా సాధించాడు ! ఆ సైకో కిల్లర్ ఏ విధంగా హత్యలు చేస్తున్నాడు! ఈ క్రమంలో హీరోకు ఎదురైన సమస్యలు ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ “కట్ పుట్లీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఇదే సినిమాను రథ్సాసన్ , తెలుగులో రాక్షసుడు అనే పేరుతో.. తీశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుయజేయండి.

Show comments