Best Sci Fi Movie In OTT: ఆకాశం వైపు చూస్తే ప్రాణాలు పోతాయి.. OTT లో వెరైటీ సైన్స్ ఫిక్షన్ మూవీ

సైన్స్ ఫిక్షన్ తరహా కథలు చూడడానికి కాస్త తికమకగా ఉంటూ ఉంటాయి. దీనితో ఒక్కోసారి ఆ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు. కానీ మరీ అంతా తికమక పెట్టకుండా.. సింపుల్ గా ఉండే అర్దమైపోయే ఈ సైన్స్ ఫిక్షన్ కథను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

సైన్స్ ఫిక్షన్ తరహా కథలు చూడడానికి కాస్త తికమకగా ఉంటూ ఉంటాయి. దీనితో ఒక్కోసారి ఆ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు. కానీ మరీ అంతా తికమక పెట్టకుండా.. సింపుల్ గా ఉండే అర్దమైపోయే ఈ సైన్స్ ఫిక్షన్ కథను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

హర్రర్, సస్పెన్ థ్రిల్లర్స్ ఏ కాకుండా సైన్స్ ఫిక్షన్ తరహా కథలకు కూడా కొంత క్రేజ్ ఉంది. ఈ తరహా సినిమాలు చూడడానికి కాస్త తికమకగా ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కసారి చూసి చిన్న చిన్న లాజిక్స్ అర్ధం చేసుకుంటే మాత్రం ఈ సినిమాలు మంచి కిక్ ఇస్తాయని చెప్పి తీరాలి. కాస్త తికమకగా ఉండడంతో ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు.. కానీ, తికమకపెట్టకుండా.. సింపుల్ గా అర్దమైపోయేలా ఉండే కొన్ని సినిమాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ మూవీ కథేంటంటే.. కాలిఫోర్నియాలోని ఓ చిన్న పల్లెటూరిలో.. ఓజే, తన తండ్రి, చెల్లెలు ఎమరాల్డ్ తో కలిసి ఉంటూ ఉంటాడు. ఈ ఫ్యామిలీ అంతా కూడా గుర్రాలను పెంచుతూ ఉంటారు. వాటిని హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కు రెంట్ కు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఓజే, తన తండ్రి కలిసి బయట మాట్లాడుకుంటూ ఉండగా.. ఎవరో గట్టి గట్టిగా అరుస్తున్నట్లుగా ఆకాశం నుంచి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటా అని పైకి చూస్తే.. చాలా స్పీడ్ గా నాణేల వర్షం పడుతుంది. అవి కాస్త ఓజే తండ్రి తలకు తగలగా అతను అక్కడే మరణిస్తాడు. తండ్రి చనిపోవడంతో వారి గుర్రాల వ్యాపారం కూడా డల్ అయిపోతుంది. ఇక వేరే దారి లేక.. వారి దగ్గర ఉన్న గుర్రాలను.. అదే ప్రాంతంలో ఉండే జూప్స్ అనే వ్యక్తికి అమ్మేస్తాడు ఓజే. మరో వైపు ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఆకాశంలో ఓ వింత ఆకారాన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలు. ఎక్కడైతే ఆ ఆకారం కనిపిస్తుందో అ అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమి కనిపించవు.

దీనితో ఓజే కి ఓ ఐడియా వస్తుంది.. ఆ వింత ఆకారం ఓ గ్రహాంతరవాసి అయి ఉండొచ్చని.. దానిని ఫోటోలు తీసి మీడియాకు ఇస్తే వారికి చాలా డబ్బులు వస్తాయని ఆశపడతారు. ఇక అనుకున్నదే తడవుగా వారు వారి ప్లాన్ ను అమలు చేస్తారు. దానికోసం సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తారు. ఇక సరిగ్గా అదే ఏరియాలో ఉండే జూప్స్ ఓ థీమ్ పార్క్ ను ఏర్పాటు చేస్తాడు. అయితే అదే సమయంలో జూప్స్ ఏర్పాటు చేసిన ఆ పార్క్ లోను మనుషులను ఆ ఏలియన్ తినేస్తూ ఉంటుంది. కానీ అక్కడ బెలూన్స్ ను మాత్రం తినకుండా వదిలేస్తుంది. మరి ఆ ఏలియన్ ఎంత మందిని చంపేసింది ! ఏలియన్ నే పెట్టుకుందాం అనుకున్న ఓజే, ఎమరాల్డ్ పరిస్థితి ఏంటి ! అసలు ఆకాశంలోనుంచి ఆ వింత శబ్దాలు ఎందుకు వస్తాయి ! ఇవన్నీ చేస్తుంది ఏలియన్స్ ఏ నా ! ఇవన్నీ తెలియాలంటే “నోప్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్  లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments