OTT Movie Suggestion: ఒక్క రాత్రికి అమ్మాయితో ఒప్పందం! OTTలో ఊహించని ట్విస్ట్ లతో సాగే మూవీ!

OTT Movie Suggestion- Best Revenge Love Story: ఓటీటీ లో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ తో పాటు ప్రేమ కథలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మరి ఈ తరహా చిత్రాలలలో ఇప్పుడు చెప్పుకోబోయేది చిత్రం కూడా ఒకటి. మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion- Best Revenge Love Story: ఓటీటీ లో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ తో పాటు ప్రేమ కథలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మరి ఈ తరహా చిత్రాలలలో ఇప్పుడు చెప్పుకోబోయేది చిత్రం కూడా ఒకటి. మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ప్రేమకథలు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కానీ, కొన్ని ప్రేమకథలు మాత్రం కాస్త భయపెడుతూ ఉంటాయి. అలాంటి ఒక స్కేరీ లవ్ స్టోరీ గురించి మీకు చెప్పబోతున్నాం. మీరు ఈ ప్రేమకథ ఉంటే కాస్త కంగారు పడతారు కూడా. ఎందుకంటే ప్రేమ అంటే ఫీల్ గుడ్ గా ఉండాలి. కానీ, ఈ అమ్మాయి ప్రేమ కాస్త వైలెంట్ గా ఉంటుంది. ప్రేమించే వరకు పాపం ఆ అబ్బాయికి కూడా తెలీదు. పైపై అందం చూసి మంచి అమ్మాయి అనుకుంటాడు. కానీ, ప్రేమలో పడిన తర్వాత ఆమె అసలు రూపం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత అతని జీవితమే అగమ్యగోచరంగా మారిపోతుంది. ఓటీటీలో ఇది ఒక రేంజ్ లవ్ స్టోరీ.

మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే మాత్రం ఇది చూడచ్చు. కానీ, ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. కొత్తగా కూడా ఉంటుంది. కానీ, కాస్త కంగారు కూడా పుట్టిరస్తుంది. ఈ మూవీలో హీరో వన్ నైట్ స్టాండ్ కోసం ఒక అమ్మాయితో హుకప్ అవుతాడు. అయితే వాళ్లిద్దరి మధ్య అది కేవలం ఆ రాత్రికి మాత్రమే ఉండే సంబంధం. ఆ పరిచయం అక్కడితోనే ఆగిపోయింది అనుకుంటాడు. కానీ, అక్కడే అసలు కథ మొదలవుతుంది. అప్పుడే హీరోకి అసలు కష్టాలు కూడా స్టార్ట్ అవుతాయి. అక్కడితో ఆమెతో బంధం తెగిపోయిందని హీరో భావిస్తాడు. తన జీవితం తాను జీవిచడం స్టార్ట్ చేస్తాడు. కానీ, అప్పుడే మళ్లీ ఆ అమ్మాయి హీరో జీవితంలోకి వస్తుంది. అప్పటికే హీరో మరో అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. తన కోరికలు తీర్చాలంటూ ఆ అమ్మాయి హీరోని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. తన ప్రియురాలికి అన్యాయం చేయకూడదు అని ఎంతో జాగ్రత్తగా ఉంటూ వస్తాడు.

ఆఖరికి హీరోని బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. తన ప్రియురాలిని హర్ట్ చేస్తానని బెదిరిస్తుంది. ఎలాగైనా హీరోని తన వశం చేసుకోవాలి అని చూస్తూ ఉంటుంది. అయితే హీరో మాత్రం ఎక్కడికక్కడ ఆమెను కంట్రోల్ చేస్తూ వస్తాడు. ఎప్పటికైనా ఆ యువతికి వీళ్లిద్దరి చీకటి ఒప్పందం తెలియకమానదు. అసలు ఆ అమ్మాయి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది? హీరో, అతని లవర్ ని ప్రశాంతంగా వదిలేస్తుందా? హీరో మీద ప్రేమతో అమ్మాయిని ఏమైనా చేస్తుందా? హీరోపై అంత ప్రేమ ఎందుకు పెంచుకుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ పేరు ‘యూ గెట్ మీ’ ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కొంచం ఇబ్బందికర సన్నివేశాలు కూడా ఉంటాయి. అంటే హాలీవుడ్ మూవీ కాబట్టి కచ్చితంగా అలాంటి సన్నివేశాలు ఉంటాయి. పైగా ఇది A సర్టిఫికేషన్ మూవీ అందుకే ఎవరూ లేకుండా చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Show comments