iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: OTTలో ముగ్గురు అమ్మాయిల కథ! బో*ల్డ్ నెస్ లో ఒకరిని మించి ఒకరు!

  • Published May 31, 2024 | 6:57 PM Updated Updated May 31, 2024 | 6:57 PM

ఓటీటీ లో కొన్ని సినిమాలు ఎంజాయ్ మెంట్ తో పాటు.. ఇది కదా ఓ మంచి ఎంటర్టైనర్ అనే ఫీల్ కూడా ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉందేమో చూసేయండి.

ఓటీటీ లో కొన్ని సినిమాలు ఎంజాయ్ మెంట్ తో పాటు.. ఇది కదా ఓ మంచి ఎంటర్టైనర్ అనే ఫీల్ కూడా ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉందేమో చూసేయండి.

  • Published May 31, 2024 | 6:57 PMUpdated May 31, 2024 | 6:57 PM
OTT Movie Suggestion: OTTలో ముగ్గురు అమ్మాయిల కథ! బో*ల్డ్ నెస్ లో ఒకరిని మించి ఒకరు!

ఓటీటీ లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంది . ఈరోజు థియేటర్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో ఆ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతాయనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దీనితో కొత్త సినిమాల కోసం వెయిట్ చేసే క్రమంలో ఓటీటీ లో ఉన్న కొన్ని పాత సినిమాలను మిస్ చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పటివరకు ఓటీటీ లో ఓ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఫన్ బేస్డ్ చిత్రాలను చూసి ఉంటారు.ఇది కూడా అలాంటిదే కానీ ఇక్క అమ్మాయిల గ్యాంగ్.. మరి సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించాలి. ఇంతకీ ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో… మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా ఉందో లేదో ఓ లుక్ వేసేయండి.

అసలు కథేంటంటే.. చైత్ర రంగనాథన్ అనే అమ్మాయికి పెళ్లి.. దానికి ముందు రోజే ఆ పెళ్లికి తన ఫ్రెండ్ చంద్రిక వస్తుంది. అలాగే వీరిద్దరూ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ కేథరిన్ అనే అమ్మాయిని కలుస్తారు. వారు ముగ్గురు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఓ పబ్ లో చిల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చంద్రిక తానూ ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని.. కానీ అతను మరొక అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడని.. అది చూసి తట్టుకోవడం తన వలన కాదని చెప్తుంది. తానూ సూసైడ్ చేసుకుంటానని వాళ్ళ ముందు ఏడుస్తుంది. అయితే ఆమెను ఓదార్చే క్రమంలో ఆమెతో పాటు మిగిలిన ఇద్దరు కూడా .. వాళ్లకు తెలీకుండానే డ్రగ్స్ కలిపినా వోడ్కాను తాగుతారు. కట్ చేస్తే తెల్లవారేసరికి వారంతా కూడా అండమాన్ లో ఉంటారు. అది కూడా క్రూజ్ లోని మూడు లక్షల రూపాయల విలువైన ఓ సూట్ రూమ్ లో. అర్ధరాత్రి 12 వరకు హైదరాబాద్ లోనే ఉన్న అమ్మాయిలు.. తెల్లారేసరికి అండమాన్ కు ఎలా వచ్చారు? చైత్ర కు కాబోయే పెళ్లికొడుకు పరిస్థితి ఏంటి ? ఆ ముగ్గురు అమ్మాయిలకు డ్రగ్స్ కలిపి ఇచ్చింది ఎవరు ? అసలు ఆ ముగ్గురు అమ్మాయిల బ్యాక్ స్టోరీ ఏంటి ? వీళ్ళను ఎవరైనా టార్గెట్ చేశారా ? ఇవన్నీ తెలియాలంటే “3 C’s ” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అంజి, దేవుళ్ళు సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా నటించిన నిత్యా శెట్టి.. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించింది. ఆమెతో పాటు జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు. వన్ టైమ్ వాచబుల్ సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio